మోతె వంటి లైబ్రరీలు రెండు రాష్ట్రాల్లో ఏర్పాటు కావాలి | - | Sakshi
Sakshi News home page

మోతె వంటి లైబ్రరీలు రెండు రాష్ట్రాల్లో ఏర్పాటు కావాలి

Nov 17 2026 1:38 AM | Updated on Nov 17 2026 1:38 AM

వేల్పూర్‌: ఆధునిక లైబ్రరీలు రెండు తెలుగు రాష్ట్రా ల్లో మరిన్ని ఏర్పాటు కావాల్సిన అవసరం ఉందని ఏపీ రిటైర్డ్‌ ఐఏఎస్‌ వాడ్రేవు చినవీరభద్రుడు పేర్కొన్నట్లు మోతె లైబ్రరీ దాత అల్లపుల్ల గంగారెడ్డి తెలి పారు. సోమవారం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో నిర్వహించిన సాహితీగోష్ఠికి చినవీరభద్రుడి ని ఆహ్వానించినట్లు తెలిపారు. మోతె లైబ్రరీని సందర్శించి స్కూల్‌ పిల్లలతో గడపడానికి, ప్రత్యేక తరగతులు తీసుకోవడానికి త్వరలో మోతెకు వస్తానని చినవీరభద్రుడు చెప్పారని తెలిపారు. రష్యన్‌ రచయిత చింగిజ్‌ ఐత్యాతోవ్‌ రచించిన తెల్లజింక పుస్తకాన్ని తనతో ఆవిష్కరింపజేసినట్లు పేర్కొన్నారు. రచయిత విజయ్‌ జీడిగుంట, పింగళి వెంకయ్య మనుమరాలు పింగళి చైతన్య పాల్గొన్నారన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement