చికిత్స పొందుతూ యువకుడి మృతి
నవీపేట: కుటుంబ కలహాలతో ఆత్మహత్యకు యత్నించిన ఓ యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఎస్సై శ్రీకాంత్ తెలిపిన వి వరా ల ప్రకారం.. నవీపేట మండల కేంద్రానికి చెందిన ఎనగందుల నరసింహ(26) మూడేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరగడంతో ఇటీవల ఆమె పుట్టింటికి వెళ్లింది. మద్యానికి బానిసైన అతను ఈ నెల 8న పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన కుటుంబీకులు మంటలను ఆర్పి చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం ఉద యం మృతి చెందాడు. మృతుడి సోదరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
తమ్ముడి మృతి తట్టుకోలేక అన్న ఆత్మహత్య
బోధన్: తమ్ముడి మృతి తట్టుకోలేని ఓ అన్న చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఎడపల్లిలో చోటు చేసుకుంది. ఎస్సై ముత్యాల రమ తెలిపిన వివరాలు.. ఎడపల్లి మండల కేంద్రానికి చెందిన కాశిగొల్ల పెద్ద గంగాధర్(43) తమ్ముడు నెల రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. నాటి నుంచి తమ్ముడి మృతి మరణాన్ని తలుచుకుంటు బాధపడేవాడు. దీంతో మనస్తాపానికి గురైన అతను ఈ నెల 12న రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబీకులు పలుచోట్ల వెతికినా ఆచూకీ లభించలేదు. ఆదివారం స్థానిక చెరువులో మృతదేహం ఉన్నట్లు గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని గంగాధర్‌గా గుర్తించారు. కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
గుర్తు తెలియని మృతదేహం లభ్యం
రుద్రూర్:మండల కేంద్రంలోని పెద్ద చెరువులో ఆదివారం గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు చెరువు వద్ద కు వెళ్లి మృతదేహాన్ని వెలికి తీయించారు. కేసు నమో దు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రామ్ తెలిపారు.
తాళం వేసిన ఇంట్లో చోరీ
నవీపేట: మండలంలోని నాగేపూర్ గ్రామానికి చెందిన పత్తి భూదేవి ఇంట్లో దుండగులు చోరీకి పాల్పడినట్లు ఎస్సై శ్రీకాంత్ ఆదివారం తెలిపారు. రెండు రోజుల క్రితం భూదేవి ఇంటికి తాళం వేసి బంధువుల ఇంటికి వెళ్లింది. ఆదివారం ఇంటికి వచ్చి చూడగా తాళం పగల గొట్టి ఉండటాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. బీరువాలో ఉన్న 3 గ్రాముల బంగారం, 4 తులాల వెండి ఆభరణాలు చోరీకి గురైనట్లు బాధితులు తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
పేకాట స్థావరంపై దాడి
రుద్రూర్: మండల కేంద్రంలో పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేశారు. పేకాట ఆడుతున్న ముగ్గురిని అదుపులోకి తీసుకోగా వారి నుంచి రూ.3,590 నగదును స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు ఎస్సై రామ్ తెలిపారు.


