మున్సిపల్‌ ఔట్‌సోర్సింగ్‌ యూనియన్‌ నూతన కార్యవర్గం ఎన్నిక | - | Sakshi
Sakshi News home page

మున్సిపల్‌ ఔట్‌సోర్సింగ్‌ యూనియన్‌ నూతన కార్యవర్గం ఎన్నిక

Nov 16 2026 12:44 AM | Updated on Nov 16 2026 12:44 AM

హైమాస్ట్‌ లైట్ల ప్రారంభం ఆరుతడి పంటలు వేసేవారు పేర్లు నమోదు చేసుకోవాలి

కమ్మర్‌పల్లి(భీమ్‌గల్‌): భీమ్‌గల్‌ మున్సిపల్‌ ఔట్‌సోర్సింగ్‌ యూనియన్‌ అధ్యక్షుడిగా గుర్రం విజయ్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం మున్సిపల్‌ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన సమావేశంలో యూనియన్‌ సభ్యుల సమక్షంలో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షులుగా పత్రి బాల, బచ్చలవారి భాగవ్వ, పత్రి సాయమ్మ, ప్రధాన కార్యదర్శులుగా బేల్దారి భూమన్న, కాకి కిషన్‌, కోశాధికారిగా బచ్చలవారి కాళిదాస్‌, సలహా దారులుగా సున్నపు ఓంకార్‌, నవీన్‌, విజయ, విశ్వనాథ్‌, రాజారాం, ప్రవీణ్‌, పోసాని, చెప్పల లక్ష్మిల ను ఎన్నుకున్నారు. యూనియన్‌ సభ్యులు హరీష్‌, రఘు, దివ్య, మనోహర్‌, భాస్కర్‌, మధు, దశ, సునీత, కాకి తార, మహేందర్‌, మున్సిపల్‌ ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు పాల్గొన్నారు.

కమ్మర్‌పల్లి(ఏర్గట్ల): ఏర్గట్ల మండల కేంద్రంలో యాదవ సంఘం శ్రీ మల్లన్న స్వామి ఆలయం వద్ద రూ.1.50 లక్షల 15వ ఆర్థిక సంఘం నిధులతో ఏర్పాటు చేసిన హైమాస్ట్‌ లైట్లను ఆదివారం యాదవ సంఘం సభ్యులు ప్రారంభించారు. హైమాస్ట్‌ లైట్లకు నిధులు మంజూరు చేయించిన కాంగ్రెస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి సునీల్‌ కుమార్‌, కాంగ్రెస్‌ మండలాధ్యక్షుడు శివనోళ్ల శివకుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్‌ మండలాధ్యక్షుడు శివనోళ్ల శివకుమార్‌, నాయకులు రేండ్ల రాజారెడ్డి, సున్నపు శ్రీనివాస్‌, గడ్డం జీవన్‌, ముస్కు మోహన్‌, పన్నాల నర్సారెడ్డి, సున్నపు గణపతి, బద్దం ఇంద్ర, దండేవోయిన సాయికుమార్‌, పూలుర్‌ గంగయ్య, యాదవ సంఘ పెద్ద మనుషులు మేరుగు మహేందర్‌, మేరుగు సురేష్‌, తదితరులు పాల్గొన్నారు.

వేల్పూర్‌: పచ్చలనడ్కుడ సొసైటీ పరిధిలోని గ్రా మాలలో యాసంగిలో వరికి బదు లు ఆరుతడి పంటలు సాగు చేసే రైతులు సోమవా రం పేర్లు నమోదు చేసుకోవాలని పచ్చలనడ్కుడ ఏ ఈవో సుభష్య ఆదివారం ఒక ప్రకటనలో తెలిపా రు. వరి పంట పండే భూములలో మాత్రమే ఆరుత డి పంటలు వేయడానికి సిద్ధమైన రైతులు సొసైటీకి ఉదయం 10 గంటలకు పట్టాదారు పాస్‌బుక్‌, ఆధార్‌కార్డుతో వచ్చి నమోదు చేసుకోవాలని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement