రెవెన్యూ పట్టాలు ఫారెస్ట్‌ నోటీసులు | - | Sakshi
Sakshi News home page

రెవెన్యూ పట్టాలు ఫారెస్ట్‌ నోటీసులు

Nov 16 2026 12:38 AM | Updated on Nov 16 2026 12:38 AM

ఇందల్వాయి : అటవీ, రెవెన్యూ శాఖల మధ్య సమన్వయ లోపం కారణంగా చాలా గ్రామాల్లో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఫారెస్ట్‌ భూములను ఆక్రమించారంటూ కొంత మంది రైతులకు ఈ మధ్య కొంత మంది రైతులకు నోటీసులు ఇచ్చిన సంబంధిత అధికారులు.. రెవెన్యూ పట్టాలు కలిగి ఉన్న వారికి సైతం అందజేయడంతో ఆందోళన నెలకొంది. ఇందల్‌వాయి రేంజ్‌ పరిధిలో మొత్తం 570 మంది రైతులకు నోటీసులు జారీ చేశారు. నోటీసులు అందుకున్న వారం రోజుల్లో భూములపై కలిగి ఉన్న హక్కుపత్రాలతో స్థానిక అటవీశాఖ కార్యాలయంలో హాజరు కావాలని అటవీ అధికారులు పేర్కొన్నారు.

పట్టాలు ఉన్న తమకు కూడా నోటీసులు ఎందుకు ఇచ్చారని, వరినారు సిద్ధం చేసుకున్న తమ పరిస్థితి ఇప్పుడు ఏమిటని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నోటీసులను ధిక్కరిస్తే కేసులు నమోదు చేస్తామని, ట్రాక్టర్లను సీజ్‌ చేస్తామని అటవీ అధికారులు పేర్కొంటుండడంతో ఏం చేయాలి, ఎవరిని సంప్రదించాలి అని రైతులు ఆందోళన చెందుతున్నారు.

నిర్లక్ష్యం.. తప్పిదం..

రూరల్‌ నియోజకవర్గంలోని సిరికొండ, ఇందల్‌వాయి, నిజామాబాద్‌ సౌత్‌ రేంజ్‌ల పరిధిలోని చాలా గ్రామాల్లో ఏళ్లుగా అటవీభూములు ఆక్రమణకు గురవుతున్నా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించారనే విమర్శలున్నాయి. రికార్డుల పరిశీలన, క్షేత్ర స్థాయి విచారణ లేకుండా ఆక్రమనకు గురైన భూములకు రెవెన్యూ అధికారులు పట్టాలు జారీ చేయడంతో చాలా చోట్ల అటవీభూముల్లో ఉన్న రైతులకు రెవెన్యూ సర్వే నంబర్లతో పట్టాలు వచ్చాయి. చాలా చోట్ల అటవీ, రెవెన్యూ శాఖలు వివాదాస్పద ప్రాంతాల్లో సంయుక్త సర్వే నిర్వహించినా ఇప్పటి వరకు శాశ్వత హద్దులు నిర్ణయించలేక పోతున్నారు. దీంతో అటవీ శాఖ అధికారులకు, రైతులకు తరుచు వివాదాలు తలెత్తుతున్నాయి. ఇకనైనా రెవెన్యూ, అటవి శాఖల మధ్య ఉన్న వివాదాస్పద భూములకు శాశ్వతంగా పరిష్కారం చూపి అర్హులైన రైతులకు న్యాయం చేయటమే కాకుండా అటవి భూములకు పూర్తి రక్షణ కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.

రెండు శాఖల మధ్య సమన్వయ లోపం

అటవీ భూములను

సాగు చేయొద్దని నోటీసులు

ఇబ్బందులు పడుతున్న రైతులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement