ఎస్జీఎఫ్‌ పోటీల్లో జిల్లా హవా | - | Sakshi
Sakshi News home page

ఎస్జీఎఫ్‌ పోటీల్లో జిల్లా హవా

Nov 16 2026 12:38 AM | Updated on Nov 16 2026 12:38 AM

కమ్మర్‌పల్లి(బాల్కొండ)/బీబీపేట(కామారెడ్డి)/కరీంనగర్‌స్పోర్ట్స్‌/నిజామాబాద్‌ అర్బన్‌ : స్కూల్‌ గేమ్స్‌ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని ఆయా జిల్లాల్లో నిర్వహించిన క్రీడల్లో పాల్గొన్న జిల్లా జట్లు ఉత్తమ ప్రతిభ కనబరిచాయి. కమ్మర్‌పల్లిలోని గ్రీన్‌ఫీల్డ్‌ మినీ స్టేడియంలో నిర్వహించిన 12వ తెలంగాణ రాష్ట్రస్థాయి జూనియర్‌ సాఫ్ట్‌బాల్‌ పోటీల్లో బాలుర జట్టు విజేతగా నిలిచింది. రన్నర్‌గా హన్మకొండ, తృతీయ స్థానంలో మంచిర్యాల జట్లు నిలిచాయి. కామారెడ్డి జిల్లా బీబీపేటలో నిర్వహించిన అండర్‌–14 బాలికల హాకీ ఫైనల్స్‌లో మహబూబ్‌నగర్‌ జట్టుతో తలపడిన జిల్లా బాలికల జట్టు విజేతగా నిలిచింది. జిల్లాకు చెందిన సాక్షిత, లోహిత, సంధ్య, పవళి, సంధ్య, మల్లేశ్వరి జాతీయస్థాయి జట్టుకు ఎంపికయ్యారు.

కరీంనగర్‌ జిల్లా కేంద్రంలోని సెయింట్‌ ఆల్ఫోన్స్‌ ఉన్నత పాఠశాల మైదానంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి ఎస్జీఎఫ్‌ అండర్‌–17 బాలబాలికల బాస్కెట్‌బాల్‌ చాంపియన్‌షిప్‌ నిర్వహించారు. బాలికల విభాగంలో జిల్లా బాలికల జట్టు ద్వితీయ స్థానంలో, బాలుర జట్టు తృతీయస్థానంలో నిలిచాయి. మేడ్చల్‌ జిల్లా షామీర్‌పేట్‌లో నిర్వహించిన ఖోఖోలో జిల్లా జట్టు ద్వితీయస్థానాన్ని కై వసం చేసుకుంది. అలాగే సంగారెడ్డి జిల్లా దౌల్తాబాద్‌లో నిర్వహించిన అండర్‌ –14 వాలీబాల్‌ పోటీల్లో జిల్లా జట్టు విజేతగా నిలిచింది.

జిల్లా క్రీడాకారులు రాష్ట్రస్థాయిలో ఉత్తమ కనబరిచి సత్తాచాటారని క్రీడాకారులు, క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేశారు.

హాకీ, సాఫ్ట్‌బాల్‌లో చాంపియన్‌గా

జిల్లా జట్లు

బాస్కెట్‌బాల్‌, ఖోఖోలో రన్నర్‌ స్థానం

జిల్లా క్రీడాకారులకు

అభిమానుల అభినందన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement