ఘనంగా జాతీయ గౌరవ దివస్‌ | - | Sakshi
Sakshi News home page

ఘనంగా జాతీయ గౌరవ దివస్‌

Nov 16 2026 12:38 AM | Updated on Nov 16 2026 12:38 AM

నిజామాబాద్‌అర్బన్‌: స్వాతంత్య్ర సమరయోధుడు, గిరిజనుల హక్కులు, అస్తిత్వం కోసం పోరాడిన భగవాన్‌ బిర్సా ముండా జయంతిని పురస్కరించుకుని జాతీయ గౌరవ దివస్‌ను కలెక్టరేట్‌లో ఆదివారం ఘనంగా నిర్వహించారు. గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న అడిషనల్‌ కలెక్టర్‌ రాజాగౌడ్‌ బిర్సాముండా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బ్రిటీష్‌ పాలకులకు వ్వతిరేకంగా పోరాడి గిరిజన భూహక్కుల పరిరక్షణ కోసం తన ప్రాణలను అర్పించిన గొప్ప వ్వక్తి అని అన్నారు. బిర్సాముండా జీవితం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి భాస్కర్‌, పరిపాలన అధికారి వేణుమాధవ్‌, సహదేవ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement