రీ సర్వేను గడువులోగా పూర్తి చేయాలి | - | Sakshi
Sakshi News home page

రీ సర్వేను గడువులోగా పూర్తి చేయాలి

Nov 16 2026 12:38 AM | Updated on Nov 16 2026 12:38 AM

● హద్దులు, రికార్డుల వివరాలను పక్కాగా నమోదు చేయాలి

● అధికారులతో కలెక్టర్‌ ఇలా త్రిపాఠి

కమ్మర్‌పల్లి(భీమ్‌గల్‌) : భూముల రీసర్వే ప్రక్రియను పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్‌ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. భీ మ్‌గల్‌ మండలం బాచన్‌పల్లిలో కొనసాగుతు న్న రీసర్వే ప్రక్రియను అదనపు కలెక్టర్‌ రాజా గౌడ్‌తో కలిసి కలెక్టర్‌ ఆదివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రతి భూమికి సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాలని, యజమానుల వివరాలు, సర్వే నంబర్లు, విస్తీర్ణం, హద్దులు తదితర అంశాల్లో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా కచ్చితత్వంతో వివరాలు నమోదు చేయాలని అధికారులకు సూచించా రు. క్షేత్రస్థాయిలో గుర్తించిన వివరాలను సంబంధిత రికార్డులతో సరి చూసుకోవాలన్నారు.

రీసర్వే పూర్తయిన అనంతరం భూ రికార్డు లు మరింత కచ్చితత్వంతో అందుబాటులోకి వస్తాయని, భవిష్యత్‌లో భూ వివాదాలను త గ్గించేందుకు ఇది దోహదపడుతుందని కలెక్టర్‌ పేర్కొన్నారు. రీ సర్వే కోసం వినియోగిస్తున్న రోవర్‌ మెషిన్లను మరిన్ని జిల్లాకు తెప్పిస్తున్నామని, వీటిని వినియోగిస్తూ అదనపు బృందాలను ఏర్పాటు చేసి సకాలంలో పూర్తి చేయాల ని సూచించారు. లైసెన్స్‌డ్‌ సర్వేయర్ల సేవలను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని, ఉత్తమ పనితీరు కనబర్చే సర్వేయర్లకు ప్రతి నెలా ప్రోత్సాహక బహుమతిగా నగదు పారితోషికాలు అందజేస్తామని అన్నారు. కలెక్టర్‌ వెంట ఆర్మూర్‌ సబ్‌ కలెక్టర్‌ అభిజ్ఞాన్‌ మాల్వియా, సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ ఏడీ అశోక్‌, తహసీల్దార్‌ కిరణ్‌, సంబంధిత రెవెన్యూ అధికారులు, సర్వే సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు, రైతులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement