దోమకొండ: తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (టీపీసీబీ) అసిస్టెంట్ సైంటిస్ట్‌గా దోమకొండకు చెందిన కోట రమేశ్ ఎంపిక య్యారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ శనివారం రాత్రి పరీక్ష ఫలితాలు విడుదల చేసింది. మాజీ ఎంపీపీ కోట సదానంద కుమారుడైన రమేశ్ ప్రస్తుతం కామారెడ్డిలోని మంజీర డిగ్రీ కళాశాలలో లెక్చరర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. అంకితభావంతో విధులు నిర్వర్తించి మంచి పేరు తీసువస్తానని ఆయన పేర్కొన్నారు. రమేశ్‌ను పలువురు అభినందించారు.
కామారెడ్డి అర్బన్: ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ ఫైనాన్స్ కమిటీ రాష్ట్ర మెంబర్‌గా జిల్లాకు చెందిన ఎంజైపాల్రెడ్డి ఎన్నికయ్యారు. రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఆధ్వర్యంలో సొసైటీ రాష్ట్ర సమావేశం నిర్వహించారు. స్థానిక ఆర్కే విద్యాసంస్థల సీఈవో, అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడైన జైపాల్‌రెడ్డి ఇదివరకే స్టేట్ కౌన్సిల్ మెంబర్‌గా జిల్లా తరఫున ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తాజాగా ఫైనాన్స్ కమిటీ సభ్యుడిగా ఎంపికవ్వడంపై జిల్లా చైర్మన్ సంజీవరెడ్డి, డైరెక్టర్లు బాలు, దత్తాద్రి తదితరులు అభినందనలు తెలిపారు.


