పీజీ సీట్లు 3 నుంచి 98కి..
పేషెంట్‌లు, ప్రత్యేక భవనాలు
నిజామాబాద్‌అర్బన్ : జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో క్రమంగా సీట్ల సంఖ్య పెరుగుతుండడం అటు కళాశాలకు, ఇటు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి కలిసి వస్తోంది. అదనపు సీట్లతో మెడిసిన్ విద్య మెరుగుపడుతోంది. స్థాపించిన తక్కువ సమయంలోనే ఆయా విభాగాల్లో నేషనల్ మెడికల్ కౌన్సిల్ అదనపు సీట్లను మంజూరు చేస్తూ వస్తోంది. రాష్ట్రంలోనే జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాల నాల్గో స్థానంతో ప్రత్యేక గుర్తింపు దక్కించుకుంది.
దశలవారీగా..
వంద ఎంబీబీఎస్ సీట్లతో 2013లో కళాశాల ప్రారంభమైంది. ఆ తరువాత 2019లో 20 సీట్లు, 2026లో మరో 30 సీట్లు మంజూరు కాగా, మొత్తం సీట్ల సంఖ్య 150కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలోని ఉస్మానియా, గాంధీ, కాకతీయ మెడికల్ కళాశాలల తర్వాత నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కళాశాల నాల్గో స్థానంలో నిలిచింది. నిర్వహణ, ఉత్తమ ఫలితాలు మౌలిక సదుపాయాల కల్పనతో మంచి గుర్తింపు లభించడంతో అదనంగా సీట్లు మంజూరయ్యాయి. గతేడాది సెప్టెంబర్27న ప్రిన్సిపాల్‌గా బాధ్యతలు స్వీకరించిన కృష్ణమోహన్.. ఎంబీబీఎస్, పీజీ సీట్లపై ప్రత్యేక దృష్టి సారించారు. నేషనల్ మెడికల్ కౌన్సిల్ కు దశలవారీగా విన్నవించారు. గత ఏడాది నుంచి ఇప్పటివరకు 30 ఎంబీబీఎస్, 25 పీజీ సీట్లు మంజూరయ్యాయి.
ఎంఆర్‌ఐ యంత్రం లేక ఇక్కట్లు
హైదరాబాద్‌తోపాటు నల్లగొండ, సంగారెడ్డి, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాలకు ఇటీవల ఎంఆర్‌ఐ స్కానింగ్ యంత్రాలు మంజూరు కాగా, అత్యధిక సంఖ్యలో ఓపీ ఉండే నిజామాబాద్‌కు మంజూరుకాకపోవడం గమనార్హం. గత అక్టోబర్ నెలలో ఇన్ పేషెంట్‌లు 3,777, అవుట్ పెషెంట్‌లు 55926 నమోదయ్యారు. జనరల్ సర్జరీ విభాగంలో 1524, ఆర్థో విభాగంలో 974, గైనిక్ విభాగంలో 375 మేజర్ సర్జరీలు అయ్యాయి. ప్రతిరోజూ 15 నుంచి 25 మంది రోగులకు ఎంఆర్‌ఐ స్కానింగ్ అవసరమవుతోంది. రోడ్డు ప్రమాదాలతోపాటు తల, మెదడు నరాల వ్యవస్థకు సంబంధించి ఇతర అత్యవసర పరిస్థితుల్లో ఎంఆర్‌ఐ స్కానింగ్ ఎంతో ఉపయోగపడుతుంది. ప్రైవేట్‌లో ఎంఆర్‌ఐ స్కానింగ్ చేస్తే రూ.5 వేల నుంచి రూ.11 వేల వరకు చార్జీలు వసూలు చేస్తున్నారు. ఇది పేదవాడికి ఎంతో భారమవుతోంది. గతేడాది ఎంఆర్‌ఐ స్కానింగ్ కోసం ప్రత్యేక గదిని కేటాయించి ఏర్పాట్లు చేసినా ఇప్పటి వరకు స్కానింగ్‌యంత్రం రాలేదు.
ఎంఆర్‌ఐ స్కానింగ్ మంజూరు చేయాలని ప్రతిపాదనలను పంపించాం. ఈ అంశం ఉన్నతాధికారుల దృష్టిలో ఉంది. మంజూరు చేస్తే ఇక్కడ రోగులకు ఎంతో ఉపయోగం. ప్రతిరోజూ రోగుల సంఖ్య పెరగడంతోపాటు ఎంఆర్‌ఐ అవసరమున్న వారి సంఖ్య కూడా ఎక్కువగా ఉంటోంది. ప్రస్తుతం సీటీ స్కానింగ్‌ఉంది.
– డాక్టర్ రాములు, జీజీహెచ్ సూపరింటెండెంట్
ప్రభుత్వ మెడికల్ కళాశాలలో 2018లో మూడు సీట్లతో పీజీ విద్య ప్రారంభమైంది. 2019లో ఆ రు, 2020లో 48సీట్లు, 2022లో ఎనిమిది, 2023లో మూడు, 2024లో ఐదు, 2025లో ఎనిమిది, 2026లో 17 పీజీ సీట్లు మంజూరు కాగా.. ప్రస్తుతం 98 సీట్లతో పీజీ విద్య అందు తోంది. 20 డిపార్ట్ మెంట్‌లలో పూర్తిస్థాయిలో పీజీ మెడిసిన్ విద్య అందుబాటులో ఉంది.
మెడికల్ కళాశాలకు అనుబంధంగా ప్రభుత్వ జ నరల్ ఆస్పత్రి ఉండడం, ప్రతిరోజూ ఇన్, అవు ట్ పేషెంట్‌ల సంఖ్య 2వేలకు పైగా నమోదవుతుండడం అదనపు సీట్ల మంజూరుకు కలిసి వ స్తోంది. ఆయా విబాగలకు ప్రత్యేక భవనాలు, బోధన, బోధనేతర సిబ్బంది అందుబాటులో ఉండడం అనుకూలంగా మారింది. ప్రిన్సిపాల్‌తో పాటు 13 మంది ప్రొఫెసర్లు, 17 మంది అ సోసియేట్ ప్రొఫెసర్లు, 110 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్‌లు, 14 మంది ట్యూటర్లు ఉన్నారు. సీ నియర్, జూనియర్ రెసిడెంట్ వైద్యులు 43 మంది చొప్పున 86 మంది అందుబాటులో ఉ న్నారు. సివిల్ అసిస్టెంట్ సర్జన్లు ఐదుగురు, బో ధన, బోధనేతర సిబ్బంది సీట్లకు తగిన సంఖ్య లో అందుబాటులో ఉన్నారు. మరికొంత మందిని కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియమించారు.
ప్రభుత్వ మెడికల్ కళాశాలకు
దశలవారీగా అదనపు సీట్లు
ఎంబీబీఎస్‌లో 150.. పీజీలో 98 సీట్లతో కొనసాగుతోన్న కళాశాల
రాష్ట్రంలోనే నాల్గో స్థానంలో కాలేజీ


