భూముల రీసర్వేను వేగవంతం చేయాలి | - | Sakshi
Sakshi News home page

భూముల రీసర్వేను వేగవంతం చేయాలి

Nov 14 2026 7:45 AM | Updated on Nov 14 2026 7:45 AM

వేల్పూర్‌(మెండోరా) : రైతులు, భూ యజమానుల ప్రయోజనార్థం ఫ్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన భూముల రీ సర్వేను వేగవంతం చేయాలని కలెక్టర్‌ ఇలా త్రిపాఠి అన్నారు. మెండోరా మండలం వెల్గటూర్‌లో కొనసాగుతున్న భూ భారతి రీ సర్వేను అడిషనల్‌ కలెక్టర్‌ రాజాగౌడ్‌తో కలిసి కలెక్టర్‌ గురువారం పరిశీలించారు. సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ఽ అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలను పక్కాగా పాటిస్తూ, నిబంధనలకు అనుగుణంగా సర్వే నిర్వహించాలని, భవిష్యత్‌లో ఎలాంటి ఇబ్బందులు ఉత్పన్నం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. రైతులు, పట్టాదారులకు ఇబ్బందులు కలుగకుండా చూడాలన్నారు. ప్రతిరోజూ సగటున 30 ఎకరాల చొప్పున సర్వే పూర్తి చేయాలని అఽధికారులను ఆదేశించారు. ఏవైనా ఇబ్బందులు ఏర్పడితే తమ దృష్టికి తేవాలని, రీ సర్వే వేగవంతంగా చేయడానికి అవసరమైతే అదనంగా రోవర్‌ యంత్రాలను సమకూరుస్తామని చెప్పారు.

రీ సర్వే ప్రక్రియలో అలసత్వాన్ని సహించేది లేదని స్పష్టం చేశారు. భూమి హద్దుల నమోదులో పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సర్వే అనంతరం గ్రామసభలు నిర్వహిస్తూ ఎవరికై నా అభ్యంతరాలుంటే వారి నుంచి దరఖాస్తులు స్వీకరించి, వేగంగా పరిష్కరించాలని పేర్కొన్నారు. కలెక్టర్‌ వెంట ఆర్మూర్‌ సబ్‌ కలెక్టర్‌ అభిజ్ఞాన్‌ మాల్వియా, సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌, రెవెన్యూ అధికారులు, రైతులు ఉన్నారు.

భవిష్యత్‌లో ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలి

అలసత్వాన్ని సహించేది లేదు

అధికారులతో కలెక్టర్‌ ఇలా త్రిపాఠి

వెల్గటూర్‌లో సర్వే పరిశీలన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement