బోధన్/ఆర్మూర్ టౌన్: కార్తీక మాసాన్ని పుర స్కరించుకుని పలు పుణ్యక్షేత్రాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసులను నడుపనుంది. నిర్ణీత తేదీల్లో బోధన్, ఆర్మూర్ డిపోల నుంచి లగ్జరీ బస్సులు బ యల్దేరనున్నాయని ఆయా డిపోల మేనేజర్లు విశ్వ నాథ్, ప్రతిమారెడ్డి గురువారం తెలిపారు.
ఈ నెల 22న ఉదయం 10 గంటలకు బోధన్ బ స్టాండ్ నుంచి అరుణాచలం పుణ్యక్షేత్రానికి బస్సు బయల్దేరనుంది. 23న కాణిపాకం, వెల్లూర్ గోల్డెన్ టెంపుల్ దర్శనంతరం అదే రోజు రాత్రికి అరుణాచలం చేరుకుంటుంది. 24న కార్తీక పౌర్ణమి గిరి ప్రదక్షిణ, దర్శనం అనంతరం సాయంత్రం అక్కడి నుంచి బయలుదేరుతుంది. తిరుగు ప్రయాణంలో 25న మహానంది, అలంపూర్ జోగులాంబ, బీచు పల్లి హనుమాన్ దేవాలయాన్ని దర్శనం చేసుకుని 26న ఉదయం బోధన్‌కు చేరుకుంటుంది. బస్సు చార్జీ పెద్దలకు రూ.5,500, పిల్లలకు రూ.2,750.
మహారాష్ట్రలోని పండరీపూర్‌కు ఈ నెల 19వ తేదీ న ఉదయం 9 గంటలకు బోధన్ నుంచి ప్రత్యేక బస్సు బయలుదేరనుంది. తుల్జాపూర్, సోలాపూర్ మీదుగా పండరీపూర్ క్షేత్రానికి చేరుకుంటుంది. మరుసటి రోజు ఏకాదశి రోజున దర్శనం అనంత రం తిరుగుప్రయాణంలో గాణుగాపూర్ దత్తాత్రేయస్వామి, బీదర్ నరసింహస్వామి దర్శనం అ నంతరం 21న రాత్రికి బస్సు బోధన్‌కు చేరుకుంటుంది. బస్సు చార్జీలు పెద్దలకు రూ.2,300, పిల్లలకు రూ.1150.
– బోధన్ నుంచి ఆయా పుణ్యక్షేత్రాలకు వెళ్లాలనుకునే వారు టికెట్ బుకింగ్ కోసం 63014 15975, 9985602789, 9959226001ను సంప్రదించాలి.
తుల్జాపూర్ భవానీ అమ్మవారి ఆలయంతోపాటు గణుగాపూర్ దత్తాత్రేయ స్వామి, బీదర్ నరసింహస్వామి ఆలయాల దర్శనానికి ఆర్మూర్ డిపో నుంచి లగ్జరీ బస్సు ఈనెల 14వ తేదీన సాయంత్రం 6 గంటలకు బయలుదేరనుంది. మొత్తం 36 సీట్లు ఉంటాయి. చార్జీ ఒక్కొక్కరికీ రూ.2,100. ఒక గ్రా మం నుంచి 36 మంది భక్తులు ఉంటే ఆ గ్రామానికే నేరుగా బస్సు సౌకర్యం కల్పించనున్నారు.
కార్తీక మాసంలో ప్రత్యేక బస్సులు నడుతున్న ఆర్టీసీ
బోధన్ నుంచి అరుణాచలం,
పండరీపూర్..
ఆర్మూర్ నుంచి తుల్జాపూర్‌కు
లగ్జరీ సర్వీస్‌లు


