సృజనాత్మకతను పెంపొందించుకోవాలి | - | Sakshi
Sakshi News home page

సృజనాత్మకతను పెంపొందించుకోవాలి

Nov 14 2026 7:45 AM | Updated on Nov 14 2026 7:45 AM

సిరికొండ: నేటి పోటీ ప్రపంచంలో పుస్తక పరిజ్ఞానంతోపాటు సాంకేతిక పరిజ్ఞానం, వృత్తి నైపుణ్యాలు, సృజనాత్మక ఆలోచనా విధానాన్ని పెంపొందించుకోవాలని విద్యార్థులకు ఆదర్శ పాఠశాలల రాష్ట్ర అదనపు డైరెక్టర్‌ శ్రీనివాసాచారి సూచించారు. మండల కేంద్రంలోని పీఎంశ్రీ తెలంగాణ ఆదర్శ పాఠశాల/కళాశాలను గురువారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. తరగతి గదులు, పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న సౌకర్యాలు, విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు, కంప్యూటర్‌ ల్యాబ్‌, వృత్తి విద్యా విభాగాలు, మౌళిక సదుపాయాలు, పరిసరాలు, సదుపాయాలను ఆయన పరిశీలించారు. విద్యార్థులతో వివిధ అంశాలపై మాట్లాడారు. ప్రిన్సిపాల్‌ రాజేశ్‌రెడ్డి, ఉపాధ్యాయులు, సిబ్బంది ఉన్నారు.

ఉద్యోగుల సమస్యల

పరిష్కారానికి కృషి

నిజామాబాద్‌అర్బన్‌: ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి టీఎన్జీవోస్‌ ఎల్లప్పుడూ ముందంజలో ఉంటుందని టీఎన్జీవోస్‌ జిల్లా అధ్యక్షుడు సుమన్‌కుమార్‌ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని విద్య, వ్యవసాయశాఖల కార్యాలయాల్లో టీఎన్జీవోస్‌ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్‌, జిల్లా కోశాధికారి నిరంజన్‌గౌడ్‌, ఉపాధ్యక్షులు శివకుమార్‌, విద్యాశాఖ అధ్యక్ష, కార్యదర్శులు అశ్విన్‌కుమార్‌, శోభన్‌ తదితరులు పాల్గొన్నారు.

సిర్‌పూర్‌ విద్యార్థినికి రాష్ట్రస్థాయి కవితా బహుమతి

మోపాల్‌: తెలంగాణ సారస్వత పరిషత్‌ (హైదరాబాద్‌) ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి బాలల కవితారచన పోటీల్లో మండలంలోని సిర్‌పూర్‌ ఉన్నత పాఠశాల విద్యార్థిని కొమ్మేటి హరిణికి ప్రత్యేక బహుమతి లభించిందని హెచ్‌ఎం వి సత్యనారాయణ గురువారం తెలిపారు. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇటీవల నిర్వహించిన పోటీల్లో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 1400 మంది హాజరయ్యారు. హరిణి రాసిన ‘నా తెలుగు..’ అనే కవితకు బహుమతి లభించింది. ఈనెల 22న పరిషత్‌ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో నిర్వహించే బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమంలో ప్రముఖ సాహితీవేత్తల చేతుల మీదుగా హరిణి బహుమతి అందుకోనుంది. విద్యార్థినితోపాటు తెలుగు ఉపాధ్యాయుడు, కవి కాసర్ల నరేశ్‌రావును హెచ్‌ఎం, సిబ్బంది అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement