బ్రహ్మోత్సవాలకు దక్షిణబద్రి రెడీ | - | Sakshi
Sakshi News home page

బ్రహ్మోత్సవాలకు దక్షిణబద్రి రెడీ

Nov 14 2026 7:45 AM | Updated on Nov 14 2026 7:45 AM

బ్రహ్మోత్సవాలు..

● నేడు పెద్దంగంటి ఎల్లమ్మకు సారె సమర్పణ

● 15న కొండపైకి శ్రీవారి రాకతో

ఉత్సవాలు ప్రారంభం

● 17న ధ్వజారోహణం

● నింబాచలానికి తరలిరానున్న భక్తజనం

● 15న మధ్యాహ్నం ఒంటి గంటకు శ్రీవారు గ్రా మాలయం నుంచి కొండపైకి బయల్దేరుతారు.

● 16న క్షీరాభిషేకం, దీపారాధన, పుణ్యహావాచనం, అంకురార్పణ

● 17న ధ్వజారోహణ

● 18న నరసింహ ఏకాక్షరిహవనం, అన్నకూటోత్సవం, శ్రీవారి కల్యాణం ఎదుర్కోలు

● 19న శ్రీవారి కల్యాణోత్సవం

● 20న నృసింహ ఏకాక్షరిహవనం

● 21న హరివాసరము, ప్రభోదోత్సవం, తులసీవివాహం, కొండ ప్రదక్షిణ, గురుడసేవ

● 22న హోమం, బలిప్రదానం

● 23న ధాత్రీమూలే శ్రీనృసింహపూజ, ధాత్రీహవ నం, సాయంత్రం దీపోత్సవం, డోలారోహణం.

● 24న జాతర, రథోత్సవం

● 25న శేష హోమం, చక్రతీర్థం, వ్యాసపూజ, పూర్ణాహుతి, పుష్పయాగం

● 26న దేవతోద్వాసనం, ధ్వజావరోహణం, ఉద్వాసన బలిప్రదానం, కొండబలి, పుష్కరిణిపై డోలోత్సవం, శ్రీవారు అశ్వవాహనంపై గ్రామాలయానికి ఊరేగింపుగా వేంచేయుటతో ఉత్సవాల ముగింపు.

కమ్మర్‌పల్లి (భీమ్‌గల్‌) : దక్షిణ బ్రదీనాథ్‌గా వెలు గొందుతున్న లింబాద్రి నరసింహస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. భీమ్‌గల్‌ శివారులో కొండలు, ప్రకృతి రమణీయత మధ్య లక్ష్మీ సమేతుడిగా కొలువుదీరిన నరసింహు డిని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలిరానున్నారు. ఈనెల 15 నుంచి 26 వరకు ఉత్సవాలు వైభవంగా కొనసాగనున్నాయి. శుక్రవా రం (నేడు) క్షేత్రదేవి పెద్దంగంటి ఎల్లమ్మకు సారె సమర్పించనున్నట్లు ఆలయ ప్రధాన అర్చకుడు నంబి పార్థసారథి తెలిపారు. ముఖ్య ఘట్టమైన రథోత్సవం, కల్యాణం రోజున లక్షలాది మంది జనంతో నింబాచల క్షేత్రం కిటకిటలాడుతుంది.

స్థల ప్రాశస్త్యం

బ్రహ్మ వైవర్త పురాణంలో నింబాచల క్షేత్ర ప్రస్తావన ఉంది. చతుర్ముఖుడైన బ్రహ్మ సరస్వతీ సమేతుడై నింబాచల క్షేత్రంలో తపమాచరించారని, పరమ శివుడు జోడు లింగాల రూపంలో వెలిశాడని స్థల పురాణం చెబుతోంది. బ్రహ్మదేవుడు, ప్రహ్లాదుడు, వాయుదేవుడు, ఇంద్రుడు తపస్సు చేసి ముక్తి పొందారని ప్రతీతి. ఈ ఆలయంలో మాత్ర మే స్వామి వారికి బిల్వ పత్రం(పత్రిఆకు) సమర్పిస్తారు. యమధర్మరాజు ఈ క్షేత్రంలో తపస్సు చేశాసి స్వామి వారి వరంతో కొండపై బిల్వ వృక్షంగావెలిశాడని వేదపండితులు చెబుతుంటారు. అందుకనే స్వామి వారికి బిల్వ పత్రం సమర్పిస్తారని అష్టాదశ పురాణాల్లో ఒకటైన వైష్ణవ పురాణంలో ఈ క్షేత్రం గురించి వివరించారు. కొండపై రాతి గుహలో మహాలక్ష్మి, కృష్ణుడు, అర్జునుడు, హనుమాన్‌ సమేతంగా స్వామివారు కొలువుదీరారు. పక్కన కృష్ణార్జునుల విగ్రహాలు ఉన్నాయి. దేశంలో బద్రినాథ్‌లో మాత్రమే ఇలా కృష్ణార్జునుల సమేతంగా లక్ష్మీనృసింహుని విగ్రహం ఉంటుంది. దీంతో ఈ క్షేత్రాన్ని బద్రీనాథ్‌ అని కూడా అంటారు.

కమల పుష్కరిణి

కొండపైన ఉన్న కమల పుష్కరిణికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ పుష్కరిణిలోని నీటిని కేవలం స్వామివారి నిత్యాది పూజా కార్యక్రమాలకు వాడుతుంటారు. పుష్కరిణి మొత్తం రాతి కట్టడంతో సుందరంగా ఉంటుంది.

ప్రశాంత వదనంతో స్వామివారు

స్వామివారు ఉగ్రరూపంతో కాకుండా ప్రశాంత వ దనంతో ఉంటారు. ఇది దేశంలోని అన్ని అవతారాలకు భిన్నం. బ్రహ్మోత్సవాల్లో నిత్య పూజలందుకు నే లక్ష్మీనృసింహుల ఉత్సవ విగ్రహాలు భీమ్‌గల్‌ ప ట్టణంలోని లక్ష్మీనరసింహస్వామి గ్రామాలయంలో ఏడాది పొడుగున నిత్య పూజలు అందుకుంటాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement