● పారదర్శకంగా ‘చేయూత’నందించాలి
● జిల్లాకు కొత్తగా 20,555 పింఛన్‌లు
● ప్రభుత్వ సలహాదారు సుదర్శన్‌రెడ్డి
● లబ్ధిదారులకు మంజూరుపత్రాల పంపిణీ
బోధన్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న ‘చేయూత’ సాయాన్ని అర్హులకు అందించాలని, అనర్హులకు చోటివ్వొద్దని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పొద్దుటూరి సుదర్శన్‌రెడ్డి అధికారులకు సూచించారు. మహిళల సంక్షేమం, వారి అభ్యున్నతికి ప్రాధాన్యతనిస్తూ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు. పింఛన్ లబ్ధిదారులకు మంజూరు పత్రాలను సాలూర మండల కేంద్రంలోని టీటీడీ కల్యాణ మండపంలో గురువారం అందజేశారు. సుదర్శన్‌రెడ్డిని అధికారులతోపాటు ప్రజాప్రతినిధులు గజమాలతో సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నూతన పింఛన్‌లు, రేషన్‌కార్డులతోపాటు ఇందిరమ్మ ఇళ్ల మంజూరును ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందన్నారు. తాజాగా జిల్లాకు కొత్తగా 20,555 పెన్షన్లు మంజూరయ్యాయని తెలిపారు. అర్హులకు సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి చేకూరేలా చూడాలన్నారు. అడిషనల్ కలెక్టర్ భుజంగరావు, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నగేశ్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్ నాగేశ్వర్‌రావు, టీపీసీసీ డెలిగేట్ గంగాశంకర్, ఎంపీడీవో నర్సయ్య, తహసీల్దార్ అజ్మత్ నవాజ్ తదితరులు పాల్గొన్నారు.
కొత్త పింఛన్‌ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమానికి సాలూర సర్పంచ్ మినహా అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఆయా గ్రామాల సర్పంచ్‌లు మూకుమ్మడిగా గైర్హాజరు కావడం చర్చకు దారి తీసింది. ముఖ్య ప్రజాప్రతినిధితోపాటు అధికారుల వద్ద తమకు కనీసం గౌరవం లేకుండా పోయిందని నారాజ్ అవుతున్న సర్పంచ్‌లు గైర్జాజరయ్యారని పలువురు పేర్కొన్నారు.
సాలూర కొత్త రెవెన్యూ మండలమైనా తమపై అధికార పక్షానికి చెందిన బోధన్ మండల ముఖ్య నాయకులదే పెత్తనం సాగుతోందని సర్పంచ్‌లు ఆవేదన చెందుతున్నట్లు తెలుస్తోంది.


