నిజామాబాద్అర్బన్: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నర్సింగ్ ఆఫీసర్ల పాత్ర చాల ముఖ్య మని డీఎంహెచ్వో రాజశ్రీ అన్నారు. వైద్యాధికారి, ఫార్మాసిస్ట్, ల్యాబ్ టెక్నిషియన్లు సమన్వయంతో నాణ్యమైన ఆరోగ్య సేవలందించా లని సూచించారు. జిల్లా కేంద్రంలోని వైద్యారోగ్యశాఖ కార్యాలయంలో నర్సింగ్ ఆఫీసర్లకు గురువారం శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా డీఎంహెచ్వో మాట్లాడుతూ.. రక్తహీనత, ని మోనియాను నియంత్రించాలని, ఆరోగ్య కేంద్రానికి వచ్చే రోగులను ప్రేమపూర్వకంగా చూ డాలన్నారు. అన్ని జాతీయ ఆరోగ్య కార్యక్ర మాలపై స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలన్నారు. గర్భిణుల చికిత్స, ప్రసవం కోసం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.


