మాక్లూర్: మండలంలోని ముత్యంపల్లి గ్రామ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందారు. ఎస్సై అనిల్‌రెడ్డి తెలిపిన వివరాలు ఇలా.. ముత్యంపల్లి శివారులో వరి కోతలు కోయడానికి బుధవారం వరి కోత మిషన్‌ను తీసుకొచ్చిన హైచర్ వాహనం రోడ్డు పక్కన నిలిపి ఉంది. గ్రామానికి చెందిన దొడ్డికింది సాయి తేజ (23) బైక్‌పై రాత్రివేళ కాలకృత్యాలకు బయటకు వెళ్లగా, గ్రామ శివారులోని రోడ్డుపక్కన నిలిచిఉన్న ఐచర్ వాహనాన్ని ఢీకొన్నాడు. ఈ ఘటనలో అతడికి తీవ్ర గాయాలు కాగా, స్థానికులు గమనించి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. వారు వెంటనే అతడిని ఆస్పత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యలో మృతిచెందాడు. మృతుడి సోదరుడు సాగర్ ఫిర్యాదు మేరకు రోడ్డుపై నిర్లక్ష్యంగా ఉంచిన హైచర్ వాహన డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.


