నిజామాబాద్‌అర్బన్: ఎన్‌హెచ్‌ఎం (నేషనల్ హెల్త్ మిషన్) ఉద్యోగులు ఆందోళన చెందవద్దని, తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ అన్నారు.నగరంలోని ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌజ్‌లో గురువారం ఆయనను ఎన్‌హెచ్‌ఎం సిబ్బంది కలిసి, తమ సమస్యలను పరిష్కరించాలని వినతిపత్రం అందజేశారు. అనంతరం మహేశ్‌కుమార్‌గౌడ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతిఒక్కరికి న్యాయం జరుగుతుందన్నారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఉద్యోగుల సంఘం నాయకులు మురళి, సందీప్, షాదుల్లా తదితరులు పాల్గొన్నారు.
తెయూ(డిచ్‌పల్లి): విద్య అనేది ప్రతి చిన్నారి ప్రాథమిక హక్కు అని, విద్య ద్వారానే వ్యక్తిగత వికాసంతో పాటు సమాజాభివృద్ధి సాధ్యమవుతుందని తెయూ మైనారిటీ సెల్ డైరెక్టర్ అబ్దుల్ ఖవి అన్నారు. జాతీయ విద్యా దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ విశ్వవిద్యాలయం ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్–1 ఆధ్వర్యంలో ‘తాలీమ్ సబ్ కే లియే (అందరికీ విద్య)’ అనే నినాదంతో గురువారం డిచ్‌పల్లిలోని ఉర్దూ మీడియం ఉన్నత పాఠశాలలో విద్యా విస్తరణ, అవగాహన కార్యక్రమం (ఔట్‌రీచ్ ప్రోగ్రామ్) నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్య ప్రాముఖ్యత, బాలబాలికలకు సమాన విద్యావకాశాలు, వ్యక్తిత్వ వికాసం, విద్య ద్వారా సామాజిక అభివృద్ధి తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. దేశంలో విద్యా వ్యవస్థ అభివృద్ధికి మౌలానా అబుల్ కలాం చేసిన విశేష కృషిని విద్యార్థులకు తెలియజేశారు. హెచ్‌ఎం జీబా నాజ్లీ, ఉపాధ్యాయులు మాధవి కుమారి, నస్రీన్ సుల్తానా, సయ్యద్ బుఖారీ, సంపత్ కుమార్, హలీమా బేగం, అయూబ్, అబ్దుల్ బిన్ మొహిసిన్, లావణ్య, ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.
ఆర్మూర్‌టౌన్: ఆర్మూర్ పట్టణానికి చెందిన సీనియర్ బీజేపీ నాయకుడు ద్యాగ ఉదయ్ సెంట్రల్ బోర్ట్ ఆఫ్ ఫీల్మ్ సర్టిఫికేషన్ అడ్వెజరీ ప్యానల్ సభ్యుడిగా నియమితులయ్యారు. ఈమేరకు గురువారం సీబీఎఫ్‌సీ చైర్మన్ వెంపాటి శశిశేఖర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పదవిలో ద్యాగ ఉదయ్ మూడు సంవత్సరాలు కొనసాగనున్నారు. ఈసందర్భంగా ఉదయ్‌ను బీజేపీ నాయకులు, తదితరులు శుభకాంక్షలు తెలిపారు.
కామారెడ్డి అర్బన్: నిజామాబాద్ ప్రభుత్వ విద్యాశిక్షణ సంస్థ (డైట్)లో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులకు తాత్కాలిక విధానం ద్వారా అతిథి అధ్యాపకుల (గెస్ట్ లెక్చరర్స్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. తెలుగు, సైన్స్, సోషల్, ఆర్ట్ ఎడ్యుకేషన్ అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. సంబంధిత సబ్జెక్టులో ఎంఈడీ/బీఈడీ పూర్తిచేసిన అభ్యర్థులు అర్హులన్నారు. ఎంఈడీ అభ్యర్థులు లేకపోతే బీఈడీ వారికి అవకాశం ఉంటుందన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు ఈనెల 16లోపు దరఖాస్తులను నిజామాబాద్ డైట్ కళాశాలలో అందజేయాలన్నారు. 19న 1:5 నిష్పత్తిలో డెమో ఇంటార్వ్యూ, 20న ఎంపికై న వారి అభ్యర్థుల ప్రకటన చేస్తామన్నారు. ఎంపికై నవారు 21న విధుల్లో చేరాల్సి ఉంటుందని ప్రిన్సిపల్ తెలిపారు.
నిజామాబాద్‌అర్బన్: జిల్లా కేంద్రంలోని పోలీ స్ హెడ్ క్వార్టర్‌లోగల పోలీస్ లైన్ పరిధిలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు సమాచారం. మృతుడి వయస్సు సుమారు 35 ఏళ్ల నుంచి 40 ఏళ్ల మధ్య ఉంటాయని పోలీసులు భావిస్తున్నట్లు తెలిసింది. ఇదిలా ఉండగా ఈ ఘటనపై సీపీ సాయిచైతన్య సీరియస్ అయినట్లు సమాచారం. వివిధ విభాగాలు పనిచేసే పోలీస్ లైన్ పరిధిలో ఎవరికీ తెలియకుండా మృతదేహం ఉండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుమానాస్పద వ్యక్తులు పోలీసులైన్ పరిధిలోకి రావడంపై సంబంధిత ఆర్‌ఐలు ఏం చేస్తున్నారని సీరియస్ అయినట్లు సమాచారం. బయట వ్యక్తులు రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించినట్లు తెలిసింది. పోలీసులైన్ పరిధిలో భరోసా సెంటర్, పోలీస్ హౌసింగ్ సెంటర్ వివిధ విభాగాలు ఉన్నాయి. ఇదే ప్రాంతంలో చెట్లపొదలు గుంపులుగా ఉన్నయి. వీటి పరిధిలో ఇలాంటి ఘటన జరగడంతో సంబంధిత అధికారులపై మండిపడ్డారు.


