● అందుబాటులోకి వచ్చిన
టీజీఎన్‌పీడీసీఎల్ నూతన యాప్
డిచ్‌పల్లి(నిజామాబాద్‌రూరల్): విద్యుత్ వినియోగదారులకు మెరుగైన సేవలందించేందుకు టీజీఎన్‌పీడీసీఎల్ 20 ఫీచర్లతో కొత్తగా మార్పులు చేసిన యాప్‌ను ప్రవేశపెట్టింది. దీనిని ఆండ్రాయిడ్ మొబైల్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. యాప్ ద్వారా వినియోగదారులు తెలిపిన సమస్యలను విద్యుత్ అధికారులు పరిశీలించి సత్వరమే పరిష్కరిస్తారు. యాప్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఎన్‌పీడీసీఎల్ అధికారులు కోరుతున్నారు.
యాప్‌లోని సేవలు ఇలా..
● వినియోగదారుల గ్రీవెన్స్ సెల్: మీటర్ నంబర్, సమస్య వివరాలతో ఫిర్యాదు నమోదు చేయవచ్చు.
● పే బిల్: సర్వీస్ నంబర్ నమోదు చేసి నెలవారీ బిల్లు చెల్లించవచ్చు.
● సెల్ఫ్ రీడింగ్: ప్రతినెలా విద్యుత్ బిల్లును సొంతంగా మీటర్ రీడింగ్ తీసుకోవచ్చు.
● బిల్ హిస్టరీ: చెల్లించిన విద్యుత్ బిల్లుల చరిత్ర చూసుకోవచ్చు.
● నో యువర్ బిల్: యూఎస్‌సీ నంబర్ నమోదు చేసి బిల్లు వివరాలు తెలుసుకోవచ్చు.
● ఆన్‌లైన్ పేమెంట్ హిస్టరీ: ఆన్‌లైన్ ద్వారా చెల్లించిన వివరాలు తెలుసుకోవచ్చు.
● రిపోర్ట్ యాన్ ఇన్సిడెంట్: ఎక్కడైనా ఏదైనా సంఘటన జరిగితే జీపీఎస్ లొకేషన్‌తో ఫొటో పంపవచ్చు.
● హౌటు టేక్ న్యూ కనెక్షన్: కొత్త కనెక్షన్ కోసం ఎలా దరఖాస్తు చేయాలో తెలుసుకోవచ్చు.
● నేమ్, లోడ్ చేంజ్: విద్యుత్ మీటర్ పేరు, లోడ్ మార్పు వివరాలకు అనుగుణంగా మార్పు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
● న్యూ సర్వీస్ కనెక్షన్: మొబైల్ నంబర్ ఎంటర్ చేస్తే వన్‌టైం ఓటీపీ వస్తుంది. వెరిఫికేషన్ అనంతరం వ్యక్తిగత, బహుళ సర్వీస్‌ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. కొత్త కనెక్షన్ స్టేటస్ తెలుసుకోవచ్చు.
● ఈహెచ్‌టీ లైన్ షిప్టింగ్: విద్యుత్ లైన్‌ను ఒకచోట నుంచి మరోచోటకు మార్చుకునేందుకు దరఖాస్తు చేయవచ్చు.
● ఆధార్, మొబైల్ లింక్: ఆధార్, మొబైల్ నంబర్లను లింక్ చేసుకుంటే బిల్లు సమాచారం సెల్‌ఫోన్‌కు వస్తుంది.
● డొమెస్టిక్ బిల్ కాలిక్యులేటర్: నెలవారీ విద్యుత్ వినియోగం, మీటర్ రీడింగ్ వివరాలు నమోదు చేస్తే బిల్లు సమాచారం తెలుస్తుంది.
● పవర్ కంజప్షన్ గైడ్‌లైన్: ఏ ఉపకరణం వాడితే ఎంత విద్యుత్ వినియోగం అవుతుందో తెలుసుకోవచ్చు.
● టారిఫ్ డీటెయిల్స్: కేటగిరీల వారీగా విద్యుత్ వినియోగ చార్జీల వివరాలు ఉంటాయి.
● ఎనర్జీ సేవింగ్ టిప్స్: విద్యుత్ ఉపకరణాలు వాడేటప్పుడు పాటించాల్సిన పొదుపు సూచనలు ఉంటాయి.
● సేఫ్టీ టిప్స్: విద్యుత్ ప్రమాదాల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఉంటాయి.
● ఫీడ్‌బ్యాక్ : అందిస్తున్న సేవలపై అభిప్రాయాలు తెలియజేయవచ్చు.
● మై అకౌంట్: వినియోగదారుల పూర్తి వివరాలు ఉంటాయి.
● బిల్ సమాచారం: సర్వీస్ నంబర్ నమోదు చేస్తే బిల్లు వివరాలు తెలుసుకోవచ్చు.
● నో యువర్ ఆఫీసర్ : వినియోగదారుల పరిధిలోని అధికారుల ఫోన్ నంబర్లు లభ్యమవుతాయి.
● కాంటాక్ట్ అస్: ఇరవై నాలుగు గంటలపాటు పనిచేసే టోల్ ఫ్రీ నంబర్లు ఉంటాయి. సమస్య పరిష్కారం కోసం 1800–425–0028, 1912 నంబర్లను సంప్రదించవచ్చు.


