డంపింగ్‌యార్డులో గుట్టలుగా పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలు
నగరంలోని డంపింగ్‌యార్డులో భారీగా ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపో యి గుట్టలాగా దర్శనమిస్తున్నాయి. ప్లాస్టిక్ వల్ల కలిగే అనర్థాలపై అ వగాహన కల్పిస్తున్నా.. ఇంతపెద్ద మొత్తంలో వ్యర్థాలు రావడంతో ప్రకృతి, జనజీవనానికి ముప్పు కలుగుతుందని పలువురు అభి ప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్లాస్టిక్ అమ్మకందారులపై జరిమానాలు విధించినా, నివారించడంలో వెనుకంజలో ఉన్నామనడానికి ఈదృశ్యం నిదర్శనంగా నిలుస్తోంది.
–సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, నిజామాబాద్


