పనులను గడువులోగా నాణ్యతతో పూర్తిచేయాలి | - | Sakshi
Sakshi News home page

పనులను గడువులోగా నాణ్యతతో పూర్తిచేయాలి

Nov 14 2026 7:45 AM | Updated on Nov 14 2026 7:45 AM

● ప్రభుత్వ సలహాదారు సుదర్శన్‌రెడ్డి

● బోధన్‌లో పట్టణ అభివృద్ధిపై సమీక్ష

బోధన్‌: ప్రజలకు మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు చేపట్టిన పట్టణ అభివృద్ధి పనులను గడువులోగా నాణ్యతతో వేగవంతంగా పూర్తి చేయాలని ప్రభుత్వ సలహాదారు, ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. పట్టణంలోని ఆర్డీవో కార్యాలయంలో గురువారం సాయంత్రం ఆయన కలెక్టర్‌ ఇలా త్రిపాఠి, అడిషనల్‌ కలెక్టర్‌ భుజంగరావుతో కలిసి పలు శాఖల అధికారులతో అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్షించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో తాగు నీటి సరఫరాకు సంబంఽధించిన పనుల పూర్తికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు సూచించారు. రాబోయే రోజుల్లో తాగునీటి సరఫరాకు ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉన్న ప్రాంతాలను గుర్తించి, ప్రత్యామ్నాయ ప్రణాళికలు రూపొందించాలన్నారు. మున్సిపల్‌ ఆఫీస్‌ కొత్త భవన సముదాయం నిర్మాణానికి టెండర్‌ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. డంపింగ్‌ యార్డు నిర్వహణ, బయోమైనింగ్‌ సక్రమంగా కొనసాగేలా చర్యలు చేపట్టాలన్నారు. బడులతోపాటు రైల్వే ఓవర్‌ బ్రిడ్జి, ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్‌ శాఖల అభివృద్ధి పనులు మైల్‌స్టోన్‌ ప్రకారం జరిగేలా పర్యవేక్షణ చేయాలన్నారు. అమృత్‌ పథకం, టీయూఎఫ్‌ఐడీసీ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ తూము పద్మాశరత్‌ రెడ్డి, ఆర్డీవో విజయకుమారి, మున్సిపల్‌ కమిషనర్‌ జాదవ్‌ కృష్ణ, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ అజ్మీరా రాము, ఉర్దూ అకాడమీ చైర్మన్‌ తాహెర్‌బిన్‌ హందాన్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement