● ఇంట్లో చెలరేగిన మంటలు
● రూ.14 లక్షలు ఆస్తి నష్టం
● వృద్ధుడిని కాపాడిన మహిళలు
గాంధారి(ఎల్లారెడ్డి): మండలంలోని చద్మల్‌తండా లో గురువారం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఘటనలో సుమారు రూ.14 లక్షల ఆస్తి నష్టం వాటిల్లగా, నాలుగు కుటుంబాలు రోడ్డున పడ్డాయి. తండావాసులు, రెవెన్యూ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. తండాకు చెందిన రాయిదాస్ మంగ్లూ, రా యిదాస్ ఇందల్‌సింగ్, రాయిదాస్ రాంసింగ్, రాయిదాస్ గులాబ్ సింగ్ సోదరులు ఒకే ఇంట్లో వేర్వేరు గదుల్లో నివాసముంటున్నారు. గురువారం ఉద యం అందరూ వ్యవసాయ పనులకు వెళ్లగా, ఇంట్లో ఒక వృద్ధుడు మాత్రమే ఉన్నాడు. ఆకస్మికంగా ఇంట్లో మంటలు అంటుకొని దర్వాజలు, కిటికీల నుంచి దట్టమైన పొగలు రావడంతో తండావాసుల గమనించి మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. ఇంట్లో ఉన్న వృద్ధుడిని మహిళలు బయటికి తీసుకువచ్చా రు. అగ్ని మాపక సిబ్బంది తండాకు చేరేలోపు ఇళ్లలో ఉన్న తిండి గింజలు, దుస్తులు, వంట సామగ్రి, బీ రువాలు, ఇతర వస్తువులన్నీ కాలిబూడదయ్యాయి. ఘట నా స్థలాన్ని సర్పంచ్ దేవిసింగ్, జీపీవో గంగారాం, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ పరిశీలించి సుమారు రూ. 14 లక్షల నష్టం వాటిల్లినట్లు అంచనా వేశారు. బాధితులకు సర్పంచ్ తక్షణ సహాయంగా బియ్యం, పప్పు దినుసులు అందించారు.


