తెయూ(డిచ్పల్లి): భారతదేశంలో యువత మత్తుకు బానిసై తమ విలువైన జీవితాన్ని సమయాన్నికోల్పోతున్నారని, యువత పెడతోవ పట్టకుండా ఉండాలని సైకిల్ యాత్ర చేపట్టినట్లు విజయలక్ష్మి తెలిపారు. ప్రధాని మోదీ పిలుపు మేరకు నషాముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా తనవంతుగా చైతన్యం తెచ్చి అవగాహన కల్పించాలనే సంకల్పంతో ‘నషా ముక్త్ – భారత్’ సైకిల్ యాత్రను చేపట్టినట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భీమవరం విజయలక్ష్మి తెలిపారు. గత నెల 22న భీమవరం నుంచి ప్రారంభించిన ఈ సైకిల్ యాత్ర డిసెంబర్ 10న న్యూఢిల్లీకి చేరుకుంటుందన్నారు. ఇప్పటివరకు సుమారు 700 కిలోమీటర్లు ప్రయాణించి తెయూకి చేరుకున్నట్లు తెలిపారు. యువత మత్తుకు బానిస కాకుండా తమ బంగారు భవిష్యత్తు కాపాడుకొని ఉన్నతమైన స్థానాల్లో నిలిచి దేశానికి ఆదర్శం కావాలని పిలుపునిచ్చారు. తెయూ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ అపర్ణ, సూపరింటెండెంట్ భాస్కర్, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.


