తెయూ(డిచ్‌పల్లి): రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శుక్రవారం తెలంగాణ యూనివర్సిటీ కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు చాక్‌డౌన్ కార్యక్రమం నిర్వహించారు. క్యాంపస్‌లోని సైన్స్ కళాశాల వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించిన అనంతరం పరిపాలనా భవనం వద్దకు చేరుకుని రిజిస్ట్రార్‌కు వినతిపత్రం అందజేశారు. కాంట్రాక్టు అధ్యాపకులకు ఉద్యోగ భద్రతతో కూడిన పే స్కేల్స్ అమలు చేసిన తర్వాతే రెగ్యులర్ రిక్రూట్‌మెంట్ ప్రక్రియ చేపట్టాలని డిమాండ్ చేశా రు. కాంట్రాక్టు అధ్యాపకులు గంగాకిషన్, దత్తహరి, కిరణ్ రాథోడ్, స్వామి, శ్రీనివాస్, రాజేశ్, జలంధ ర్,రాజేశ్వరి, జ్యోత్స్న, అపర్ణ పాల్గొన్నారు.


