పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నా
బోధన్: గ్రంథాలయాలు విజ్ఞాన వికాసానికి నిలయాలుగా, భావితరాల భవిష్యత్తుకు బాటలు వేసే కేంద్రాలు నిలుస్తున్నాయి. మారుతున్న కాలానికి అనుగుణంగా డిజిటల్ విప్లవం విస్తరించినప్పటికీ పుస్తక పఠనంపై ఆసక్తి మాత్రం తగ్గడం లేదు. ముఖ్యంగా పేద, మధ్యతరగతి విద్యార్థులు, నిరుద్యోగ యువతకు గ్రంథాలయాలు అండగా నిలుస్తున్నాయి. విద్య, ఉద్యోగ, ఉపాధి పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి ఇవి విజ్ఞాన భాండాగారాలుగా ఉపయోగపడుతున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం నుంచి ఈ నెల 20వ తేదీ వరకు జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహించనున్నారు.
ముగ్గురు మాత్రమే రెగ్యులర్
గ్రంథాలయాలకు పాఠకుల ఆదరణ లభిస్తోంది. జిల్లా గ్రంథాలయంలో నిత్యం 450 నుంచి 600 మంది పాఠకుల సందర్శన ఉంటుంది. పలు గ్రంథాలయాల్లో పాఠకుల సంఖ్య గణనీయంగా ఉంది. గ్రంథాలయలకు ఏళ్లుగా లైబ్రేరియన్‌లు, ఉద్యోగులు, సిబ్బంది కొరత పరిష్కారానికి నోచుకోవడం లేదు. జిల్లాలో 25 గ్రంథాలయలకుగాను ముగ్గురు మాత్రమే రెగ్యులర్ లైబ్రేరియన్‌లు ఉండగా, మరో 8 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు మరో గ్రంథాలయాలను ఇన్‌చార్జిలుగా నియమించి సేవలందిస్తున్నారు.
దశాబ్దాలుగా గ్రంథాలయ సేవలు
జిల్లాలో గ్రంథాలయ వ్యవస్థ పాఠకులకు విశేష సే వలందిస్తోంది. ప్రస్తుతం జిల్లా గ్రంథాలయ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంతో పాటు నియోజకవర్గ, మండల కేంద్రాలు, మేజర్ గ్రామ పంచాయతీల్లో గ్రంథాలయాలు కొనసాగుతున్నాయి. ఇటీవల సా లూర,ఆలూరులోను కొత్తగా గ్రంథాలయాలను ఏ ర్పాటు చేసి పాఠకులకు అందుబాటులోకి తీసుకొచ్చారు.వీటి ద్వారా స్థానిక విద్యార్థులు, యువతకు పుస్తక పఠనంతో పాటు పోటీ పరీక్షలకు అవసర మైన సమాచారాన్ని పొందే అవకాశం కలుగుతోంది.
రూ. 3 కోట్ల వరకు బకాయిలు
జిల్లాలోని నిజామాబాద్, బోధన్, ఆర్మూర్, భీంగల్ మున్సిపాలిటీలతో పాటు 545 గ్రామ పంచాయతీ ల్లో ఆస్తిపన్నుల్లో 8 శాతానికి గ్రంథాలయానికి చెల్లిస్తాయి. జీపీల నుంచి అధిక మొత్తంలో రావాల్సి ఉంది. ప్రస్తుతం రూ. 3 కోట్ల వరకు గ్రంథాలయ పన్ను బకాయిలు పేరుకుపోయినట్టు స్పష్టం అవుతుంది.
బోధన్ శాఖ గ్రంథాలయ భవనం
బోధన్ గ్రంథాలయానికి కొత్త శోభ
రెవెన్యూ డివిజన్ కేంద్రంలోని దయానంద్ గోశాల ఆర్య సమాజ్ భవనంలో దశాబ్దాల క్రితం గ్రంథాలయం ప్రారంభం కాగా మున్సిపల్ శాఖ ఆఫీస్ సమీపంలో ఆ శాఖ స్థలం కేటాయించింది. 1993లో కొత్త భవనం నిర్మించి ఇక్కడికి మార్చారు. ఈ గ్రంథాలయంలో చరిత్ర, సాహిత్యం, విజ్ఞాన శాస్త్రం, తత్వ శాస్త్రం తదితర సుమారు 28 వేల పైగా వివిధ భాష పుస్తకాలు ఉన్నాయి. రుద్రూర్ మండల కేంద్రంలో గ్రంథాలయ భవనం పై అంతస్తులో నిరుద్యోగ యువత పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు ప్రత్యేక రీడింగ్ రూం నిర్మించి ఇందుకు దాతలు పుస్తకాలను సమకూర్చారు. దీంతో పాఠకుల ఆదరణ గతం కంటే పెరిగి గ్రంథాలయం కొత్త శోభ సంతరించుకుంది.
నేను ఎంఎస్సీ కోర్సు పూర్తి చేశాను. వివిధ ఉద్యోగ పోటీ పరీక్షల కోసం గ్రంథాలయానికి వచ్చి చదువుకుంటున్నాను. నాలాగే చాలా మంది నిరుద్యోగ యువత ఇక్కడికి వస్తున్నారు. – రాజేశ్, పాఠకుడు, బోధన్
పాఠకుల ఆదరణ ఉన్నా
వేధిస్తున్న లైబ్రేరియన్‌ల కొరత
పేరుకుపోతున్న గ్రంథాలయ
పన్ను బకాయిలు
పట్టించుకోని అధికారులు
నేటి నుంచి 20 వరకు జాతీయ
గ్రంథాలయ వారోత్సవాలు


