డిచ్‌పల్లి: జిల్లాలో చారిత్రక ప్రసిద్ధి పొందిన డి చ్‌పల్లి ఖిల్లా రామాలయాన్ని జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్‌వో) గీత తన కుటుంబ సభ్యుల తో కలిసి శుక్రవారం సందర్శించారు. సీతారాములకు ప్రత్యేక పూజలు చేపట్టారు. ఖిల్లా రామాలయం కమిటీ చైర్మన్ ఏ గంగాదాస్ డీఆర్‌వోను శాలువాతో సత్కరించారు.
ఖలీల్‌వాడి:విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకొని ఆ దిశగా పయనించాలని మేయర్ ఉమారాణి, డీఈవో సాయాగౌడ్ ఆన్నారు. శుక్రవారం నగరంలోని కసాబ్‌గల్లీ బాలికల ఉన్నత పాఠశాల వార్షికోత్సవం నిర్వహించారు. ముందు గా జ్యోతి ప్రజల్వన చేసిన అనంతరం వారు మాట్లాడారు. అన్ని పోటీ పరీక్షల్లో విద్యార్థినులే ముందు ఉంటున్నారని, వచ్చే పరీక్షలో ఉత్తమ ఫలితాలు సాధించాలన్నారు. విద్యార్థులు పదో తరగతి తర్వాత ఎలాంటి కోర్సులు చేస్తే బా గుంటుందని,టీచర్లు, కుటుంబసభ్యులతో చ ర్చించాలన్నారు. దీంతో ప్రణాళిక బద్దంగా చదివితే ముందుకెళ్లే అవకాశం ఉంటుందన్నా రు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన 35 మంది విద్యార్థులకు మోడల్స్ అందించారు. కార్యక్రమంలో ఎంఈవో సాయారెడ్డి పాల్గొన్నారు.
సుభాష్‌నగర్: హైదరాబాద్‌లో ఈనెల 15న నిర్వహించనున్న హెచ్‌సీఎల్ 54 కిలోమీటర్ల సైకిల్ రేసింగ్‌కు ఇందూరు రైడర్స్ సిద్ధమవుతున్నారు. రేసులో ప్రతిభ కనబర్చడమే లక్ష్యంగా ప్రతిరోజకూ సాధన చేస్తున్నారు. నగరంలోని డీఎస్ చౌరస్తా నుంచి మాధవనగర్ బ్రిడ్జి వరకు ప్రాక్టీస్ చేస్తున్నారు. పోటీల్లో ఇందూర్ రైడర్స్ తరఫున మంచాల జ్ఞానేందర్, డాక్టర్ గౌవర్ లచ్చుర్యా, జిఘ్నేష్ పటేల్, తిరుమల నాయుడు, విశాల్ పటేల్, వైవీ రంగారావు, మోహన్ పాల్గొననున్నారు.
నిజామాబాద్‌అర్బన్: కరీంనగర్‌లో ఈనెల 13 నుంచి 15వ తేదీ వరకు నిర్వహించే అండర్–17 బాస్కెట్‌బాల్ బాలురఽజట్టుకు జి ల్లాకు చెందిన ఏ రమేశ్ అబ్జర్వర్‌గా నియమితులయ్యారు. నవీపేట మండలం జన్నెపల్లి ప్రభుత్వ పాఠశాలలో పీఈటీగా పనిచేస్తున్న రమేశ్‌ను అబ్జర్వర్‌గా నియమించారు. నియామకంపై పేటా అధ్యక్షుడు రవీందర్, ఉపాధ్యక్షుడు వెంకటేశ్వరరా వు,ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు.
● ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి
బోధన్: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల నూతన పాలక వర్గ సభ్యులు ఐక్యత, అంకితభావంతో రైతులకు సేవలందించాలని ప్రభుత్వ సలహాదారు సుదర్శన్‌రెడ్డి సూచించారు. శుక్రవారం ఎడపల్లి మండలంలోని జానకంపేట శివారులోని లక్ష్మీనృసింహ స్వామి ఆలయ నూతన కల్యాణ మండపంలో కొత్తగా నియమితులైన ఎడపల్లి సొసైటీ చైర్మన్ గాంధారి హన్మంత్‌రెడ్డి, జానకంపేట సొసైటీ చైర్మన్ చిక్కెల లక్ష్మణ్, పాలకవర్గ సభ్యుల ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే సమక్షంలో కొత్త పాలకవర్గ సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు.ముందుగా లక్ష్మి నర్సింహస్వామి ఆలయాన్ని సందర్శించి దైవ దర్శనం చేసుకుని, ఆలయ ప్రాంతంలో రూ.97 లక్షలతో నిర్మించిన కొత్త కల్యాణ మండపాన్ని స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులతో కలిసి ప్రారంభించారు.అనంతరం చేయూత కొత్త పెన్షన్లు, కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఆర్డీవో విజయకుమారి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్‌బిన్ హందాన్, ఏఎంసీ చైర్మన్ నాగేశ్వర్‌రావు, సర్పంచ్ సుంచనకోట అనురాధ రాధాకిషన్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పులి శ్రీనివాస్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బిల్ల రాంమోహన్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.


