వేల్పూర్(బాల్కొండ): నెమళ్లను వేటాడిన కేసులో ఐదుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు బాల్కొండ ఎస్సై యాసిర్ అర్ఫాత్ తెలిపారు. మండల కేంద్రంలోని పీఎస్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. శుక్రవారం ఉదయం 6 గంటలకు పెట్రోలు బంక్ సమీపంలో నెమళ్లను వేటాడుతున్నట్లు సమాచారం అందడంతో ఘటన స్థలికి పోలీసులు చేరుకున్నారు. వారు పోలీసులను చూసిపారిపోయేందుకు ప్రయత్నించగా పట్టుబడ్డారు. వారి వద్ద ఉన్న తెల్లసంచిలో చనిపోయిన రెండు నెమళ్లు ఉన్నాయి.
అడవి జంతువులు, పశువులను వేటాడే గ్యాంగుగా పరిగణించి, నెమళ్లకు అక్కడే పంచనామా నిర్వహించారు. నెమలిని చంపిన ఐదుగురు సంగీల నరసింహ, మేరికల్ అంకంరావు, మేకల రామయ్య, మెలిక కల్యాణ్, మెరికా అంకంరావు లను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వీరిపై వైల్డ్ లైఫ్ అనిమల్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి ఆర్మూర్ జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరు పర్చినట్లు వెల్లడించారు.


