ధర్పల్లి: మండలంలోని రామడుగు గ్రామంలో జరిగిన చైన్ స్నాచింగ్ కేసును పోలీసులు ఛేదించి, నిందితుడిని శుక్రవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఎస్సై సందీప్‌తో కలిసి సీఐ ఎస్ రామన్ కేసు వివరాలను వెల్లడించారు. సిరికొండ మండలం కొండూరు గ్రామానికి చెందిన సుద్ధపల్లి రాజు అలియాస్ బంగిడి రాజు గల్ఫ్ దేశానికి వెళ్లి ప్రమాదంలో కుడి చేతికి గాయపడడంతో తిరిగి వచ్చాడు. ప్రస్తుతం హైదరాబాద్‌లో క్యాబ్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. తన సంపాదన జల్సాలకు సరిపోకపోవడంతో సులభంగా డబ్బు సంపాదించాలని ఉద్దేశంతో ఒంటరి మహిళను లక్ష్యంగా చేసుకొని చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్నాడు. ఇందులో భాగంగా ఈనెల 7న మండలంలోని రామడుగు గ్రామంలో ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న గడ్డం పద్మ మెడలో నుంచి బంగారు గొలుసును బలవంతంగా లాక్కొని బైకుపై పరారయ్యాడు. శుక్రవారం ధర్పల్లి ఎస్సై తెలంగాణ తల్లి చౌరస్తా వద్ద వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా నిందితుడు అనుమానస్పదంగా కనిపించాడు. అతడిని అదుపులోకి తీసుకొని విచారించగా నేరం అంగీకరించాడు. నిందితుడు నుంచి మూడు తులాల బంగారు గొలుసు, బైకును స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. కేసును ఛేదించిన సీఐ ఎస్ రామన్, ఎస్సై సందీప్, కానిస్టేబుళ్లు గోవర్ధన్, అజయ్, వెంకటేశ్‌లను నిజామాబాద్ ఏసీపీ ప్రకాశ్ ప్రత్యేకంగా అభినందించారు.


