30న తుది ఓటర్ల జాబితా | - | Sakshi
Sakshi News home page

30న తుది ఓటర్ల జాబితా

Nov 14 2026 1:29 AM | Updated on Nov 14 2026 1:29 AM

● 26 వరకు అభ్యంతరాల పరిష్కారం

● కలెక్టర్‌ ఇలా త్రిపాఠి

నిజామాబాద్‌అర్బన్‌ : ఓటర్ల జాబితాపై ఈ నెల 26వ తేదీ వరకు అభ్యంతరాలను పరిష్కరించి, 30న తుది జాబితా ప్రచురిస్తామని కలెక్టర్‌ ఇలా త్రిపాఠి పేర్కొన్నారు. కలెక్టరేట్‌లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో శుక్రవారం కలెక్టర్‌ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (ఎస్‌ఐఆర్‌) తుది దశకు చేరిందన్నారు. ఈ ప్రక్రియ పూర్తిస్థాయిలో విజయవంతం అయ్యేందుకు రాజకీయ పార్టీలు తోడ్పాటును అందించాలన్నారు. ముసాయిదా ఓటర్ల జాబితాలో అబ్సెంట్‌, షిఫ్ట్‌, డెత్‌, డూప్లికేషన్‌ (ఏ.ఎస్‌.డీ.డీ) కారణాలతో పేర్లను తొలగించబడిన వారికి ఎన్నికల కమిషన్‌ ఆదేశాల ప్రకారం మరోమారు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఏఎస్‌డీడీ జాబితాలో ఉన్న వారికి తాజాగా ఎన్యూమరేషన్‌ ఫారంతోపాటు అనేగ్జర్‌–బి, అనేగ్జర్‌–సి లను అందిస్తామన్నారు. జిల్లాలో పోలింగ్‌ కేంద్రాల వారీగా బీఎల్‌వోలు ఇళ్లకు వెళ్లి వారికి అందించేలా చర్యలు తీసుకున్నామని కలెక్టర్‌ వెల్లడించారు. ఈ ప్రక్రియకు రాజకీయ పార్టీల బూత్‌ లెవెల్‌ ఏజెంట్లు తమవంతు సహకారం అందించాలని కోరారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ భుజంగరావు, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు బాలరాజు, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement