భద్రతా ప్రమాణాలు పక్కాగా అమలు చేయాలి | - | Sakshi
Sakshi News home page

భద్రతా ప్రమాణాలు పక్కాగా అమలు చేయాలి

Nov 14 2026 1:29 AM | Updated on Nov 14 2026 1:29 AM

● నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు

● బ్యాంక్‌ అఽధికారులకు

ఎస్పీ రాజేశ్‌ చంద్ర ఆదేశం

కామారెడ్డి టౌన్‌ : జిల్లాలో బ్యాంకులు, ఏటీఎం కేంద్రాల్లో నగదు, ఆభరణాల చోరీల నివారణకు భద్రతా ప్రమాణాలను పక్కాగా అమలు చేయాలని ఎస్పీ రాజేశ్‌ చంద్ర బ్యాంక్‌ అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో బ్యాంకు అధికారులతో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ప్రజల కష్టార్జిత సొమ్ము కు పూర్తి రక్షణ కల్పించడమే లక్ష్యమని, భద్రతా ఏర్పాట్లలో అలసత్వం వహించినా, నిబంధనలు ఉల్లంఘించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతి బ్యాంకు శాఖ, ఏటీఎం కేంద్రంలో ఆధునిక అలారం వ్యవస్థ, శిక్షణ పొందిన సెక్యూరి టీ గార్డులను నియమించాలన్నారు. ఏటీఎంలలో చోరీ ప్రయత్నాలను అడ్డుకునే ‘ఇంక్‌ స్ప్రెడర్‌’ పరికరాలు, లోపల, బయట హైరిజల్యూషన్‌ సీసీ కెమెరాలతో పాటు రహస్య కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. నగదు తరలించే వాహనాలకు జీపీఎస్‌ ట్రాకింగ్‌ తప్పనిసరి చేయాలని, కొత్త కేంద్రాలను జనసంచారం ఉండే సురక్షిత ప్రాంతాల్లో రాత్రివేళల్లో పటిష్టమైన లైటింగ్‌తో ఏర్పాటు చేయాలన్నారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ కె. నర్సింహారెడ్డి, డీసీఆర్‌బీ డీఎస్పీ గట్టుమల్లు, సీఐ మురళి, సైబర్‌ క్రై మ్‌ ఎస్సై నరేష్‌, జిల్లాలోని బ్యాంకుల మేనేజర్లు, ఇన్‌చార్జులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement