నిజామాబాద్ రూరల్: స్వాతంత్య్ర సమయోధుడు, భారత తొలి విద్యాశాఖ మంత్రి అబుల్ కలాం ఆజాద్ జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని, ఆయన సేవలు చిరస్మరణీయమని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కాటిపల్లి నగేశ్‌రెడ్డి అన్నారు. నగరంలోని కాంగ్రెస్ భవన్‌లో అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా జిల్లా, నగర అధ్యక్షులు నగేశ్ రెడ్డి, బొబ్బిలి రామకృష్ణ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లా డుతూ.. అబుల్ కలాం ఆజాద్ దేశ స్వాతంత్య్ర పోరాటంలో కీలక పాత్ర పోషించారని అన్నారు. డీసీసీ కోశాధికారి భక్తవత్సలం, ఉపాధ్యక్షుడు కౌడపు శరత్ కుమార్, నగర మైనారిటీ అధ్యక్షుడు అబ్దుల్ ఎజాజ్, యూత్ అధ్యక్షుడు విపుల్ గౌడ్, ఏఎంసీ డైరెక్టర్ ఈసా, సేవాదళ్ అధ్యక్షుడు సంధి బెన్సన్ రాజ్(బెన్నీ), మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ రాజేంద్ర ప్రసాద్, బంటు బలరాం, మాజీ ఎంపీపీ నర్సయ్య, అఫ్సర్, మిన్హాజ్, కోనేరు సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.


