ఉపాధి జోరు | - | Sakshi
Sakshi News home page

ఉపాధి జోరు

Nov 12 2026 12:43 AM | Updated on Nov 12 2026 12:43 AM

రుద్రూర్‌ మండలం అక్బర్‌నగర్‌లో పనులు చేస్తున్న కూలీలు

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌: జిల్లాలోని గ్రామాల్లో వీబీజీ రాంజీ (ఉపాధి హామీ) పనుల జోరు కొనసాగుతోంది. పనులకు నిత్యం పెద్ద సంఖ్యలో కూలీలు హాజరవుతున్నారు. ఈసారి ఎల్‌నినో పరిస్థితుల నే పథ్యంలో పంటల విస్తీర్ణం తగ్గి వ్యవసాయ పనులు తగ్గుముఖం పట్టాయి. ఈ క్రమంలో ఉపాధి పనులు వారికి ఆసరాగా నిలుస్తున్నాయి. ఈ నెలలో జిల్లావ్యాప్తంగా రోజుకు కనీసం 20 వేల మంది చొ ప్పున కూలీలు హాజరవుతున్నారు. సాగు పనులు లేకపోవడంతో గ్రామాల్లో ప్రజలు అత్యధికంగా ఉపాధి పనులు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు.

కరువు పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వం వీబీజీ రాంజీ పథకం ద్వారా ఎక్కువ పనిదినాలను కల్పించేందుకు చర్యలు తీసుకుంటోంది. ఎక్కువగా ‘జలసిరి’ పనులకే ప్రాధాన్యం ఇస్తూ గ్రామాల్లో ఉపాధి పనులు చేపడుతున్నారు. నీటి సంరక్షణ, చెరువుల్లో తవ్వకం పనులు, ఇంకుడు గుంతల నిర్మాణం, ఫాంపాండ్స్‌ నిర్మాణపనులను నిర్వహిస్తున్నారు. వ్యవసాయ పనులు పూర్తికావడంతో ఉపాధి పనులు చేసేందుకు మొగ్గుచూపుతున్నారు. ఈ క్రమంలో రోజూవారీగా హాజరవుతున్న కూలీల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గత మూడు నెలల్లో రోజుకు పది వేల మంది మాత్రమే కూలీలు పనులకు వచ్చారు. ఈ నెలలో నిత్యం 20 వేలకు మందికి పైగా కూలీలు పనులకు వస్తుండగా.. అందులో 12 వేల మందికిపైగా మహిళలే ఉండటం గమనార్హం.

సమాన కూలి

వ్యవసాయ కూలీకి వెళ్తే మహిళల కన్నా పురుషులకు దినసరి కూలి చెల్లింపు ఎక్కువగా ఉంటుంది. అయితే ఉపాధి హామీ కింద చెల్లించే మొత్తం సీ్త్ర, పురుష తేడా లేకుండా సమానంగా ఉంటుంది. ఈ పథకం కింద రోజుకు రూ.300 వరకు చెల్లిస్తుండటంతో అధిక శాతం మహిళలు ఇతర పనులకన్నా ఉపాధి పనులకే ఆసక్తి చూపుతున్నారు. వీబీజీ రాంజీ కింద వచ్చే ఫిర్యాదులను గరిష్టంగా 15 రోజుల్లోగా పరిష్కరించాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. పనుల కేటాయింపు, వేతనాల చెల్లింపు, సాంకేతిక సమస్యలను 15 రోజుల్లోగా పూర్తిచేయాలని నిర్దేశించింది.

రుద్రూర్‌ మండలకేంద్రానికి చెందిన ఈయన పేరు బాబూరామ్‌. వర్షాభావ పరిస్థితుల కారణంగా ఈసారి వ్యవసాయ పనులు లేకపోవడంతో నిత్యం ఉపాధి పనులకు వెళ్తున్నాడు. వ్యవసాయ పనులకు వెళ్తే వచ్చే కూలి కన్నా తక్కువ వస్తున్నా ఉపాధి పనులతో నిత్యం పని మాత్రం దొరుకుతోందని చెబుతున్నాడు. ఉపాధి పనికి వెళ్తే రోజుకు రూ.300 చొప్పున.. 10 నుంచి 15 రోజుల్లో డబ్బులు ఖాతాలో పడుతున్నాయని అంటున్నాడు. ఉపాధి పనులకు వస్తున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోందని చెప్పాడు.

కష్టకాలంలో పని దొరుకుతోంది

ఈసారి వర్షాభావ పరిస్థితులతో వ్యవసాయ పనులు లేవు. కష్టకాలంలో పని దొరుకుతోంది. పని చేసిన తర్వాత 15 నుంచి 20 రోజుల్లో డబ్బులు ఖాతాలో జమవుతున్నాయి. నీటి సంరక్షణకు జలసిరి పనులు చేస్తున్నాం. నీటి కుంటలు, ఫాంపాండ్‌ నిర్మాణ పనులు చేస్తున్నాం. గతంలో కన్నా ఎక్కువ మంది కూలీలు వస్తున్నారు. – మాదస్తు శ్రీనివాస్‌, లక్కోర, వేల్పూర్‌ మండలం

ఎల్‌నినో నేపథ్యంలో వీబీజీ రాంజీ

పథకానికి అధిక డిమాండ్‌

సాగు పనులు లేక ‘ఉపాధి’ పనులకు మొగ్గు చూపుతున్న గ్రామీణులు

జలసిరి పనుల్లో భాగంగా నీటి కుంటలు, ఫాంపాండ్స్‌ నిర్మాణాలు

జిల్లాలో రోజుకు 21 వేల మందికి పైగా కూలీల హాజరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement