డొంకేశ్వర్(ఆర్మూర్): చేయూత పింఛన్‌ల ద్వారా లబ్ధిపొందే అర్హులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. దరఖాస్తు చేసుకుని ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వారికి ఎట్టకేలకు పింఛన్‌లు మంజూరయ్యాయి. జిల్లాలో కొత్తగా 20,555 మందికి చేయూత పింఛన్‌లను మంజూరు చేసింది. ఈ మేర కు జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖ బుధవారం వివ రా లను వెల్లడించింది. పింఛన్లు మంజూరైన లబ్ధిదారులకు నేటి నుంచి నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా మంజూ రు పత్రాలను పంపిణీ చేసేందుకు అధికారులు ఏ ర్పాట్లు పూర్తి చేశారు. బుధవారం బోధన్ నియోజకవర్గం సాలూరాలో ప్రభుత్వ సలహాదారు సుదర్శన్‌రెడ్డి పింఛన్ పత్రాలను అందజేయనున్నారు. అయి తే, కొత్తగా మంజూరైన లభించిన దానిలో అత్యధికంగా వితంతువులు 11,952 మందికి, దివ్యాంగు లు 4,565 మందికి పింఛన్లు మంజూరయ్యాయి. అదే విధంగా జిల్లాలో గతంలో 2,62,046 పింఛన్ లు ఉండగా, ప్రతి నెలా రూ.56.44 కోట్ల నిధులు అవసరమయ్యేవి. ఇప్పుడు కొత్త వాటితో కలిపి మొ త్తం లబ్ధిదారుల సంఖ్య 2,82,601కి చేరగా, ప్రతినెలా పింఛన్లు అందించేందుకు రూ.61.51 కోట్ల నిధులు అవసరం కానున్నాయి. దివ్యాంగులకు రూ.4,016, మిగతా కేటగిరీల వారికి రూ.2,016 ప్రతి నెలా ప్రభుత్వం ఇస్తున్న విషయం తెలిసిందే.
వృద్ధులకు నిరాశ
మరోవైపు కొత్త పింఛన్‌ల మంజూరులో వృద్ధులకు నిరాశే మిగిలింది. గతంలో పింఛన్ వయోపరిమితిని 60 ఏళ్ల నుంచి 57 ఏళ్లకు తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పటికీ, ప్రస్తుతం 57 ఏళ్లు నిండిన వారు దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం ఎలాంటి అవకాశం కల్పించలేదు. దీంతో అర్హులైన వృద్ధులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. తామేం పాపం చేశామని బాధపడుతున్నారు.
జిల్లాకు మంజూరైన కొత్త పింఛన్‌లు
కొంటారనే ఆశతో..
జిల్లాలో వరికోతలు ప్రారంభమైన సమయంలో రికార్డు ధరకు ధాన్యాన్ని కోనుగోలు చేసిన వ్యాపారులు ఇప్పుడు ముఖం చాటేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ధర తగ్గించేశారని అంటున్నారు. రైస్ మిల్లులకు కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న నగర శివారులోని కాలూర్ ప్రాంతంలోనే ఈ పరిస్థితి ఉందంటున్నారు. కాలూర్ శివారులో ఇలా ధాన్యం కుప్పలు కనిపిస్తున్నాయి.
– సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, నిజామాబాద్
నేటి నుంచి ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా పంపిణీ
చేయూతలో అత్యధికంగా
11,952 మంది వితంతువులకు లబ్ధి
జిల్లాలో 2.82,601కి చేరిన
లబ్ధిదారుల సంఖ్య


