నగరంలో ఇందిరమ్మ టవర్స్‌ | - | Sakshi
Sakshi News home page

నగరంలో ఇందిరమ్మ టవర్స్‌

Nov 12 2026 12:43 AM | Updated on Nov 12 2026 12:43 AM

● దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం

● జిల్లా కేంద్రంలోని నాగారంలో నిర్మాణం

నిజామాబాద్‌అర్బన్‌: జిల్లా కేంద్రమైన నిజామాబాద్‌ నగరంలో ఇందిరమ్మ టవర్స్‌ నిర్మాణనికి అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఇది వరకే జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు కొనసాగుతుండగా.. ఇప్పుడు టవర్స్‌ నిర్మించనున్నారు. గత నెలలో జిల్లాలో పర్యటించిన రాష్ట్ర హౌసింగ్‌, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి నగరంలో ఇందిరమ్మ టవర్స్‌ నిర్మాణం చేపడుతామని ప్రకటించారు. అదే సందర్భంలో స్థలా న్ని సైతం పరిశీలించారు. తెలంగాణ హౌసింగ్‌ బోర్డు ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ టవర్స్‌ నిర్మాణం చేపట్టి అందుబాటు ధరల్లో అ ర్హులకు ఫ్లాట్లను అందించేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తోందని కలెక్టర్‌ ఇలా త్రిపాఠి తెలిపారు. నాగారం ప్రాంతంలోని ఆర్‌జీకే కాలనీలో ఇందిరమ్మ టవర్సలో 480 ఫ్లాట్లను నిర్మించనున్నారు.

అర్హతలు.. నిబంధనలు

దరఖాస్తుదారుకు మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో ఎక్కడా సొంత ఇల్లు లేదా ప్లాట్‌ ఉండకూడదు. కుటుంబ వార్షిక ఆదాయం రూ.6 లక్షలకు మించొద్దు. ఫ్లాట్‌ను 10 సంవత్సరాలపాటు విక్రయించడం లేదా అద్దెకు ఇవ్వడానికి అనుమతించబడదు. బ్యాంకు మార్ట్‌గేజ్‌కు అనుమతి ఉంటుంది. ఒక కుటుంబం నుంచి ఒకే దరఖాస్తు, ఒకే ఫ్లాట్‌కు మాత్రమే అవకాశం కల్పిస్తారు. మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో నివసించే వారు మాత్రమే ఈ పథకం కింద దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు.

చెల్లింపు విధానం

ఎంపికై యిన లబ్ధిదారులు తమ వాటా మొత్తాన్ని విడతల వారీగా చెల్లించాల్సి ఉంటుంది. తాత్కాలిక కేటాయింపు సమయంలో రూ.లక్ష, ఆర్‌సీసీ నిర్మాణం పూర్తయినప్పుడు రూ.లక్ష, ఫినిషింగ్‌ దశలో రూ.లక్ష, నిర్మాణం పూర్తయి ఫ్లాట్‌ అప్పగించే సమయంలో మిగతా మొత్తం వాటాను చెల్లించాల్సి ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ

అర్హులైన దరఖాస్తుదారులను గుర్తించేందుకు ముందుగా ఐడీ వెరిఫికేషన్‌ చేస్తారు. అనంతరం లాటరీ విధానం ద్వారా ఫ్లాట్లు కేటాయించి, ఎంపికై న లబ్ధిదారుల వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు.

దరఖాస్తు విధానం.. చివరి తేదీ

మీ సేవా కేంద్రాలు లేదా అధికారిక మీ సేవా వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులకు గడువు తేదీ డిసెంబర్‌ 5. మరిన్ని వివరాల కోసం హెల్ప్‌లైన్‌ నంబర్‌ 040–24603572ను సంప్రదించవచ్చు.

అర్హులు దరఖాస్తు

చేసుకోవాలి

అర్హులైన నగర ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. నిర్ణీత గడువులోగా దరఖాస్తు చేసుకోవాలి. అర్హులైన వారికి ఇళ్లను కేటాయిస్తాం. ఎంపిక ప్రక్రియ, ఇళ్ల కేటాయింపును పక్బందీగా చేపడతాం.

– ఇలా త్రిపాఠి, కలెక్టర్‌

ఫ్లాట్‌ విస్తీర్ణం.. ధర.. రాయితీ

ప్రతి ఫ్లాట్‌ రిజిస్ట్రేషన్‌ విస్తీర్ణం 512 చదరపు అడుగులు కాగా.. ఒక్కో ఫ్లాట్‌పై ప్రభుత్వం రూ.5 లక్షల సబ్సిడీ అందించనున్నది. ఫ్లాట్ల నిర్మాణానికి అవసరమైన స్థలం ఖర్చును ప్రభుత్వమే భరిస్తుంది. ప్రభుత్వ సబ్సిడీ మినహాయించి, ఒక్కో ఫ్లాట్‌కు లబ్ధిదారుడు తన వాటా రూపంలో రూ.3.50 లక్షలు (ఈ ధర తాత్కాలికంగా నిర్ణయించారు) చెల్లించాల్సి ఉంటుంది.

దరఖాస్తు రుసుము..

ఈఎండీ వివరాలు

ఒక్కో దరఖాస్తుకు రూ.100 (నాన్‌ రిఫండబుల్‌) రుసుము ఉంటుంది. ఈఎండీ/టోకెన్‌ అడ్వాన్స్‌ కింద రూ.10 వేలు చెల్లించాల్సి ఉంటుంది. ఫ్లాట్‌ కేటాయింపు జరగని వారికి ఈఎండీ వాపస్‌ చేస్తారు. ఫ్లాట్‌ కేటాయింపు జరిగిన వారికి ఈ మొత్తాన్ని లబ్ధిదారుడి వాటాలో సర్దుబాటు చేస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement