● నిర్మల్‌కు వెళ్తూ బాల్కొండలో కాసేపు ఆగిన బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
వేల్పూర్(బాల్కొండ)/పెర్కిట్(ఆర్మూర్): నిర్మల్‌లో నిర్వహించిన రైతుగర్జన సభకు వెళ్తున్న బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు బాల్కొండ వద్ద బీఆర్‌ఎస్ శ్రేణులు బుధవారం ఘనస్వాగతం పలి కాయి. నిర్మల్ వెళ్తూ ఆయన బాల్కొండలోని ఎమ్మె ల్యే ప్రశాంత్‌రెడ్డి క్యాంప్ కార్యాలయం వద్ద కొద్దిసేపు ఆగారు. అల్పాహారం, తేనేటి విందును స్వీకరించారు. ముఖ్య నాయకులు, కార్యకర్తలతో ముచ్చటించారు. పార్టీ శ్రేణులు కేటీఆర్‌తో ఫొటో లు దిగడానికి ఉత్సాహం చూపారు. కాబోయే సీఎం అంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. జిల్లా బీఆర్‌ఎస్ అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్‌రెడ్డి, మాజీ ఎ మ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్దన్, గంప గోవర్దన్, మాజీ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి తదితరులున్నారు.
ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలోని మామిడిపల్లి బైపాస్ వద్ద కేటీఆర్‌కు నాయకులతోపాటు జీవన్‌రెడ్డి ఘనస్వాగతం పలికారు. కేటీఆర్‌ను నాయకులు సన్మానించారు.


