నందిపేట్(ఆర్మూర్): దీపావళి సెలవులకు ఇంటికి వచ్చిన ఇ ద్దరు విద్యార్థులు హాస్టల్‌కు వె ళ్తూ అదృశ్యమయ్యారు. ఎస్సై వినయ్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మాక్లూర్ మండలం ధర్మోరా గ్రామానికి చెందిన గంధం సిద్ధు, కల్లెం చరణ్ నందిపేట మండలం కుద్వాన్‌పూర్‌లో ఉన్న ఎస్సీ వసతి గృహంలో ఉంటూ 9, 8వ తరగతుల్లో చదువుతున్నారు. దీపావళి సెలవులు ఇవ్వడంతో ఐదు రోజుల క్రితం స్వగ్రామానికి వెళ్తారు. మంగళవారం సాయంత్రం ఇద్దరు విద్యార్థులను వారి తల్లి దండ్రులు తిరిగి హస్టల్‌కు తీ సుకువస్తూ మార్గమధ్యలో ఆంధ్రనగర్ వద్ద నందిపేట వైపు బైక్‌పై వెళ్తున్న వ్యక్తిని లిఫ్ట్ అడి గి ఎక్కించారు. బుధవారం ఉదయం పిల్లల తల్లిదండ్రులకు హాస్టల్ వార్డెన్ ఫోన్ చేసి మీ పిల్లలు హాస్టల్‌కు ఎందుకు రాలేదని ప్రశ్నించాడు. దీంతో తల్లిదండ్రులు తమ పిల్లల ఆచూకీ కోసం వెతికి చివరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


