డొంకేశ్వర్(ఆర్మూర్): జిల్లా పంచాయతీ ఇన్‌చార్జి అధికారి నాగరాజు మంగళవారం మండలంలో పర్యటించారు. గంగాసముందర్, కోమట్‌పల్లి గ్రామాల్లో సామాజిక పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారి ఇంటి వద్దకు వెళ్లి యాప్‌లో వివరాలు నమోదు చేసుకున్నారు. అనంతరం స్థానికంగా నిర్మించిన ఇంకుడు గుంతలను పరిశీలించారు. భూగర్భజలాల పెంపు కోసం ప్రతి ఒక్కరూ ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని, నీటి పొదుపును పాటించాలని సూచించారు. గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు నిర్వహించి ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలని కార్యదర్శులను ఆదేశించారు. అనంతరం ఎంపీడీవో ఆఫీసును తనిఖీ చేశారు. ఎంపీవో అజయ్‌కుమార్, సర్పంచ్ తొగరిమహేశ్ గంగామణి, కారోబార్లు రంజిత్‌గౌడ్, గంగాధర్ ఉన్నారు.
కమ్మర్‌పల్లి: మండలంలోని కోనసముందర్ పీఎం శ్రీ జెడ్పీహెచ్‌ఎస్ విద్యార్థులు వ్యవసాయ విద్య పర్యటనలో భాగంగా మంగళవారం మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం తునికి కృషి విజ్ఞాన కేంద్రం(కేవీకే)ను సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ రకాల సేంద్రియ ఎరువుల తయారీ, సాగు విధానాలను తెలుసుకున్నారు. అనంతరం రామానాయుడు వ్యవసాయ కళాశాలలో వ్యవసాయ విద్య, విత్తనాల ఎంపిక, ఔషధ మొక్కల పెంపకంపై కళాశాల అధ్యాపక సిబ్బంది, వ్యవసాయ ఉపాధ్యాయుడు సునుగురు హరీశ్, కాలేజీ డైరెక్టర్ డాక్టర్ దేవేందర్ రెడ్డి వివరించారు. కార్యక్రమంలో పాఠశాల హెచ్‌ఎం బద్రి మధుపాల్, పీడీ రమేశ్ గౌడ్, రాజశేఖర్, భవ్య, ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు.


