తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీ నాన్‌టీచింగ్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు మంగళవారం వర్సిటీ పరిపాలన భవనం ఎదుట నల్లబ్యాడ్జీలు ధరించి ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా తెయూ నాన్‌టీచింగ్ స్టాఫ్ అధ్యక్షుడు సాయాగౌడ్ మాట్లాడుతూ.. ఉస్మానియా యూనివర్సిటీ నాన్‌టీచింగ్ స్టాఫ్ 15 రోజులుగా తమ పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం నిరసన కార్యక్రమాలు చేస్తున్నారని తెలిపారు. వారికి మద్దతుగా ధర్నా చేపట్టినట్లు పేర్కొన్నారు. రెగ్యులర్ ఉద్యోగులకు సీపీఎస్ అమలు, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమానపనికి సమానవేతనం, ఇలా అనేక సమస్యలు రాష్ట్రంలోని అన్ని వర్సిటీలలో పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ప్రభుత్వం వెంటనే వర్సిటీ ఉద్యోగుల డిమాండ్లు నెరవేర్చడంతోపాటు సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో తెయూ నాన్ టీచింగ్ స్టాఫ్ ప్రధాన కార్యదర్శి బి.భాస్కర్, ఉపాధ్యక్షుడు టి.వినోద్‌కుమార్, సంయుక్త కార్యదర్శి టి.ఉమారాణి, కోశాధికారి ఎస్. జ్యోతి, తదితరులు పాల్గొన్నారు.


