నిజామాబాద్ రూరల్: నగరంలోని రోటరీ నగర్‌లో పిచ్చికుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. రోడ్డుపై కనబడితే చాలు దాడి చేస్తున్నాయి. మంగళవారం కాలనీలోని రోడ్ నంబర్–5లో వీధి వెంట నడుచుకుంటూ వెళ్తుండగా లీలావతి, సుశీల, శంకరమ్మతోపాటు మరో మహిళపై పిచ్చికుక్కలు దాడి చేశాయి. క్షతగాత్రులను కుటుంబసభ్యులు వెంటనే జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
పెద్దకొడప్‌గల్(జుక్కల్): మండలంలోని బేగంపూర్ గ్రామంలో పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేశారు. పేకాడుతున్న 11 మందిని పట్టుకొని వారి నుంచి రూ.87,620 నగదు, 9 ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై అరుణ్‌కుమార్ తెలిపారు.
రుద్రూర్‌లో నలుగురు..
రుద్రూర్: మండల కేంద్రంలో పేకాడుతున్న నలుగు రిని పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.3,700 నగదు, ఒక ఫోన్ స్వాధీనం చేసుకున్నట్టు ఎస్సై రామ్ తెలిపారు.
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): మూడు రోజుల్లో నాగిరెడ్డిపేట మండలంలోని పలు గ్రామాల్లో మెరుపుదాడులు నిర్వహించి పేకాడుతున్న 22 మందిని పట్టుకున్నట్లు ఎస్సై అగస్త్య భార్గవ్ గౌడ్ మంగళవారం తెలిపారు. పేకాడే వారి నుంచి రూ.37,282 నగదుతోపాటు 12సెల్‌ఫోన్లు, రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు.


