డిచ్‌పల్లి: నిరుపేదలకు అత్యవసర సమయంలో కొండంత అండగా సీఎం సహాయనిధి ఉపయోగపడుతుందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి పేర్కొన్నారు. ఇందల్వాయి మండలం డొంకల్ గ్రామానికి చెందిన నానావత్ తులసీరామ్ అనారోగ్య సమస్యలతో హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. శస్త్రచికిత్స నిమిత్తం రూ.4.95 లక్షలు ఖర్చవుతుందని వైద్యులు సూచించారు. బాధిత కుటుంబీకులు ఈ విషయాన్ని ఎమ్మెల్యే భూపతిరెడ్డి దృష్టికి తెచ్చారు. దీంతో రూ.4.95 లక్షలకు సంబంధించి ఎల్‌వోసీని మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో అందజేశారు. దీంతో బాధిత కుటుంబసభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామస్తులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.


