మోతె లైబ్రరీ నా హృదయాన్ని తాకింది.. | - | Sakshi
Sakshi News home page

మోతె లైబ్రరీ నా హృదయాన్ని తాకింది..

Nov 11 2026 3:39 AM | Updated on Nov 11 2026 3:39 AM

● దర్శకుడు నర్సింగరావు ప్రశంసలు

వేల్పూర్‌: మోతె హైస్కూల్‌ లైబ్రరీని సోషల్‌ మీడియాలో వీక్షించిన ప్రముఖ దర్శకుడు నర్సింగరావు ప్రసంసిస్తూ కొనియాడినట్లు లైబ్రరీ దాత అల్లపుల్ల గంగారెడ్డి మంగళవారం తెలిపారు. లైబ్రరీ వివరాలను వీడియోలు, పేపర్ల ద్వారా తెలుసుకున్న నర్సింగరావు స్పందించారు. ప్రపంచంలో లక్షలాది లైబ్రరీలు ఉన్నాయి కానీ మోతె లైబ్రరీ మాత్రమే నా హృదయాన్ని తాకిందని పేర్కొన్నట్లు వెల్లడించారు. గ్రంథాలయ ఉద్యమానికి మద్దతుగా మీకోసం ఉన్నానని మద్దతు తెలియజేస్తూ ప్రసంసించారని పేర్కొన్నారు.

లైబ్రరీ పీరియడ్‌ ఏర్పాటు

మోతె హైస్కూల్‌ పిల్లలకు లైబ్రరీ పీరియడ్‌ అందుబాటులోకి తెచ్చారు. ప్రతి విద్యార్థి వారానికి 6 గంటలు, నెలకు కనీసం 24 గంటలు లైబ్రరీలో ఉండి టీచరు పర్యవేక్షణలో చదివేలా ప్రణాళిక రూపొందించారు. టీచరు పర్యవేక్షణలో ప్లాన్‌ ప్రకారం నిర్ణయించబడిన పుస్తకాలు చదవడంతో, చదివిన పుస్తకం మీద టీచరు రివ్యూ ఇస్తూ, అనుమానాలు తీర్చేలా లైబ్రరీ రీడిండ్‌ తరగతులు అమలు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement