‘అన్నదాన సేవా’ పోస్టర్ల ఆవిష్కరణ | - | Sakshi
Sakshi News home page

‘అన్నదాన సేవా’ పోస్టర్ల ఆవిష్కరణ

Nov 11 2026 3:39 AM | Updated on Nov 11 2026 3:39 AM

‘అన్నదాన సేవా’ పోస్టర్ల ఆవిష్కరణ

నిజామాబాద్‌ రూరల్‌: ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 16న నిర్వహించనున్న 2,000 రోజుల అన్నదాన సేవా కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను కలెక్టర్‌ ఇలా త్రిపాఠి మంగళవారం ఆమె చాంబర్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సంస్థ చేపడుతున్న సేవలను అధ్యక్షుడు మద్దుకూరి సాయిబాబు కలెక్టర్‌కు వివరించారు. నిర్విరామంగా కొనసాగుతున్న అన్నదాన కార్యక్రమం ఈ నెల 15వ తేదీ నాటికి 2,000 రోజులు పూర్తి చేసుకుంటుందని, 16న సోమవారం సాయంత్రం 6 గంటలకు కంఠేశ్వర్‌లోని ఎస్‌.ఆర్‌ బాలికల జూనియర్‌ కళాశాలలో కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరుకావాలని కలెక్టర్‌ను ఆహ్వానించారు. కార్యక్రమంలో సంస్థ ప్రతినిధి రామగిరి సుధాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement