ఓపెన్‌ పీజీ, ఎంబీఏ పరీక్ష ఫీజు చెల్లించాలి | - | Sakshi
Sakshi News home page

ఓపెన్‌ పీజీ, ఎంబీఏ పరీక్ష ఫీజు చెల్లించాలి

Nov 11 2026 3:39 AM | Updated on Nov 11 2026 3:39 AM

ఓపెన్‌ పీజీ, ఎంబీఏ పరీక్ష ఫీజు చెల్లించాలి రాష్ట్ర స్థాయిలో రాణించాలి వసూళ్లపై సీరియస్‌.. పలువురి బదిలీ! ఘనంగా భావూబీజ్‌

ఖలీల్‌వాడి: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ పీజీ, ఎంబీఏ విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించాలని జీజీ కాలేజీ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ రాంమోహన్‌ రెడ్డి, కోఆర్డినేటర్‌ రంజిత మంగళవారం తెలిపారు. పీజీ మొదటి సెమిస్టర్‌–2, ఏంబీఏ సెమిస్టర్‌–2, బీఎల్‌ఐఎస్సీ సెమిస్టర్‌–2, జర్నలిజం సెమిస్టర్‌–2, 4తోపాటు డిప్లొమా సెమిస్టర్‌–2 ఫీజులను ఈ నెల 20వ తేదీలోగా చెల్లించాలని పేర్కొన్నారు.ఈ నెల 25 వరకు రూ.500 అపరాధ రుసుముతో అవకాశం ఉందని, ఆన్‌లైన్‌ ఫీజు చెల్లించాలని సూచించారు. వివరాలకు 7382929612 నెంబర్‌లో సంప్రదించాలని తెలిపారు.

పెర్కిట్‌(ఆర్మూర్‌): ఖోఖో పోటీల్లో జిల్లా జట్టుకు ఎంపికై న క్రీడాకారులు రాష్ట్రస్థాయిలో రాణించాలని ఆర్మూర్‌ ఎంఈవో రవీందర్‌ అన్నారు. ఆర్మూర్‌ మండలం పిప్రి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మంగళవారం హెచ్‌ఎం నవీన్‌ ఆధ్వర్యంలో 70వ జిల్లా స్థాయి ఖోఖో పోటీలు నిర్వహించారు. పోటీల ముగింపు కార్యక్రమానికి ఎంఈవో ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లా ఖ్యాతిని ఇనుమడింప చేసేలా కృషి చేయాలన్నారు. వికారాబాద్‌ జిల్లాలో ఈ నెల 13 నుంచి నిర్వహించే రాష్ట్ర స్థాయి పోటీల్లో విద్యార్థులు పాల్గొననున్నారు. కార్యక్రమంలో ఎస్‌జీఎఫ్‌ కార్యదర్శి అలివేణి మంగ, క్రీడల ఆర్గనైజింగ్‌ కార్యదర్శి ఎస్‌ గంగారెడ్డి, పీఈటీలు, విద్యార్థులు పాల్గొన్నారు.

నిజామాబాద్‌ అర్బన్‌: ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌ వి భాగంలో వసూళ్ల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. కొందరు ఉద్యోగులు అనుమతు ల పేరిట వసూళ్లు చేయడంతో ఉన్నతాధికారు లు ఆగ్రహం వ్యక్తంచేస్తూ పలువురిని బదిలీ చే సినట్లు తెలిసింది. ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధి లో ముగ్గురు కానిస్టేబుళ్లు ప్రయివేటు ఆస్పత్రు లకు ట్రాఫిక్‌ సమస్య లేదని నోఅబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌ మంజూరు విషయంలో డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై విచా రణ చేపట్టిన అధికారులు ఎలాంటి పరిశీలన చేయకుండా ఎన్‌వోసీ జారీ చేశారని, ఆరు ప్రయివేటు ఆస్పత్రుల నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్లు తేల్చినట్లు సమాచారం. దీంతో ముగ్గురు సిబ్బందిని సమీప పోలీస్‌స్టేషన్‌కు బదిలీ చేయగా, కీలకపాత్ర పోషించిన ఓ ఉద్యోగిని మాత్రం తప్పించినట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

మద్నూర్‌(జుక్కల్‌): మద్నూర్‌ మండలం మహారాష్ట్ర సరిహద్దులో ఉండడంతో అక్కడి సంప్రదాయం ప్రకారం ప్రజలు ఐదు రోజులపాటు లక్ష్మి పూజలు కొనసాగిస్తారు. మంగళవారం భావూబీజ్‌ పండుగను నిర్వహించారు. సోదరీమణులు సోదరులకు తిలకం పెట్టి, హా రతి ఇచ్చి, తీపి వంటకాలు తినిపించారు. సోద రులు బహుమతులు అందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement