పసుపు రైతుల అభ్యున్నతే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

పసుపు రైతుల అభ్యున్నతే లక్ష్యం

Nov 11 2026 3:39 AM | Updated on Nov 11 2026 3:39 AM

● జాతీయ పసుపు బోర్డు చైర్మన్‌

పల్లె గంగారెడ్డి

● రైతులకు బాయిలర్‌, పాలిషింగ్‌

యంత్రాల అందజేత

పెర్కిట్‌(ఆర్మూర్‌): పసుపు రైతుల అభ్యున్నతే లక్ష్యంగా బోర్డు పని చేస్తోందని జాతీయ పసుపు బోర్డు చైర్మన్‌ పల్లె గంగారెడ్డి పేర్కొన్నారు. ఆర్మూర్‌ మున్సిపల్‌ పరిధిలోని మామిడిపల్లిలో మంగళవారం పసుపు బోర్డు ఆధ్వర్యంలో రైతులకు బా యిలింగ్‌, పాలిషింగ్‌ యంత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా పల్లె గంగారెడ్డి మాట్లాడుతూ ఆధునిక యంత్రాలను రైతులకు అందుబాటులోకి తీసుకురావడం ద్వారా పసుపు ఉడకబెట్టడం, పాలిషింగ్‌ చేసే ప్రక్రియ మరింత సులభతరం అవుతుందన్నా రు. ఉత్పత్తి నాణ్యతను పెంచి రైతులకు మెరుగైన ఆదాయం లభించేలా చేయడమే బోర్డు లక్ష్యమని తెలిపారు. అనంతరం రైతులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, యంత్రాల వినియోగంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో జాతీయ పసుపు బోర్డు కార్యదర్శి భవానీశ్రీ, డిప్యూటీ డైరెక్టర్‌ ప్రత్యూష, సీనియర్‌ ఫీల్డ్‌ ఆఫీసర్‌ రాజమాణిక్యం, రాణి, జవహార్‌, పసుపు రైతులు, నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement