యువకుడి దారుణ హత్య | - | Sakshi
Sakshi News home page

యువకుడి దారుణ హత్య

Nov 11 2026 3:39 AM | Updated on Nov 11 2026 3:39 AM

చికిత్స పొందుతూ ఒకరి మృతి

● మృతుడు బిహార్‌వాసి

నిజామాబాద్‌ రూరల్‌: రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని కాలూర్‌ శివారులో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఎస్‌హెచ్‌వో శ్రీధర్‌ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. బిహార్‌ రాష్ట్రం హర్యానా జిల్లా సల్గోడికచా గ్రామానికి చెందిన క్రిష్‌ కుమార్‌(19) స్థానిక క్లాసిక్‌ పేపర్‌ మిల్లులో లేబర్‌గా పనిచేస్తున్నాడు. మిల్లుకు సమీపంలోనే నివసిస్తున్నాడు. సోమవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు క్రిష్‌కుమార్‌ను తీసుకెళ్లి బీరు సీసాతో కడుపు, మెడ, ఛాతి భాగాల్లో పొడిచి హత్య చేసినట్లు ఎస్‌హెచ్‌వో తెలిపారు. మృతుడి తండ్రి సికిందర్‌ సదా ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

రుద్రూర్‌: మనస్తాపానికి గురై పురుగుల మందు తాగిన ఒకరు చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన కోటగిరి మండలం ఎత్తొండ గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్సై శ్రీనివాస్‌ యాదవ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ఎత్తొండ గ్రామానికి చెందిన అగ్గు శంకర్‌ (41) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కొంతకాలంగా మద్యానికి బానిసై డబ్బుల విషయమై తరచూ భార్య సుమలతతో గొడవ పడేవాడు. ఈ నెల 8న ఉదయం మద్యం తాగి ఇంటికి వచ్చి డబ్బులు ఇవ్వాలని భార్యతో గొడవపడ్డాడు. తన వద్ద డబ్బులు లేవని ఆమె చెప్పడంతో వాగ్వాదానికి దిగాడు. అనంతరం భార్య కూలి పనులకు వెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చేసరికి శంకర్‌ గుర్తుతెలియని పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. కుటుంబసభ్యులు వెంటనే శంకర్‌ను బోధన్‌ ప్రభుత్వ ఆస్పత్రికి, అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం నిజామాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం మృతి చెందాడు. మృతుడి భార్య సుమలత మంగళవారం ఫిర్యాదు చేయగా కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement