రెంజల్: మండలంలోని తాడ్‌బిలోలి హైస్కూల్‌కు చెందిన ముగ్గురు విద్యార్థులు రాష్ట్రస్థాయి నెట్‌బాల్ పోటీలకు ఎంపికై నట్లు హెచ్ఎం రేఖ పేర్కొన్నారు. జిల్లాలోని తిర్మన్‌పల్లి హైస్కూల్లో మంగళవారం స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన జిల్లాస్థాయి పోటీల్లో పాఠశాలకు చెందిన అమర్, వాజీద్, అక్షయ అత్యుత్తమ ప్రతిభను ప్రదర్శించి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై నట్లు వివరించారు. ఈ నెల 14 నుంచి మూడు రోజులపాటు మహబూబ్‌నగర్ జిల్లాలో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీల్లో విద్యార్థులు పాల్గొంటారని వివరించారు. ఎంపికై న విద్యార్థులను అభినందించారు. కార్యక్రమంలో ఫిజికల్ డైరెక్టర్ కుమార్‌తోపాటు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


