జిల్లాలో 602 విత్తన విక్రయ దుకాణాలు..
అధికారులు చర్యలు తీసుకోవాలి..
విత్తన విక్రయాలపై దృష్టిసారిస్తాం
● యాసంగిలో జోరందుకున్న
విత్తనాల విక్రయాలు
● పర్యవేక్షణ మరిచిన అధికారులు
బోధన్: ప్రస్తుతం జిల్లాలో యాసంగీ సీజన్ పంటల సాగు మొదలైంది. కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా మంజీర, గోదావరి నది తీరాల్లో ఉన్న బోధన్ డివిజన్ ప్రాంతంలోని వర్షాధార మెట్ట భూముల్లో కరెంట్ బోరుబావుల నీటి లభ్యత ఆధారంతో ఆరుతడి పంటలైన శనగ, సన్‌ప్లవర్, గోధుమ, కుసుమ విత్తు వేయడం ఇప్పుడిప్పుడే మొదలు పెట్టారు. పక్షం రోజుల క్రితం నుంచి వరి, ఇతర ఆరుతడి పంటలకు సంబంధించి విత్తన కొనుగోళ్లు కొనసాగుతున్నాయి. ఆరుతడి పంటలకు సబ్సిడీ విత్తనాల సరఫరాపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టత లేకపోవడంతో రైతులు మార్కెట్లో వివిధ కంపెనీలకు చెందిన విత్తనాలను కొనుగోలు చేస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో కల్తీ విత్తనాల ముప్పు ఉండే అవకాశాలున్నాయని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు
సదస్సుల్లో అధికారులు బిజీ..
గతంలో వ్యవసాయ శాఖ,రెవెన్యూ,పోలీస్ శాఖ అ ధికారులతో ప్రత్యేక బృందాలను (టాస్క్‌ఫోర్స్) ఏ ర్పాటు చేసి, క్షేత్రస్థాయిలో విత్తన, పురుగుమందు లు,ఎరువుల దుకాణాలను సందర్శించి తనిఖీలు చే పట్టేవారు.కాని ఈసారి అధికారుల తనిఖీల జాడ ఎక్కడా కనిపించడం లేదు. ప్రభుత్వం ఆదేశాల మే రకు వ్యవసాయ,ఇతర శాఖల అధికారులు గ్రామా ల్లో ప్రత్యామ్నాయ పంటల సాగు ప్రణాళికపై రైతు అవగాహన సదస్సులు నిర్వహించడంలో నిమగ్నమయ్యారు. దీంతో విత్తన నాణ్యతను క్షేత్ర స్థాయి లో పరిశీలించాల్సిన తనిఖీ బృందాల కదలికలు లేకపోవడం వల్ల మార్కెట్లో వ్యాపారులు సూచిస్తున్న విత్తనాలను, వారు చెప్పిన ధరకే రైతులు కొనుగోలు చేస్తున్నారు. ఆరుతడి పంటల విత్తనాల కోసం బోధన్ డివిజన్ ప్రాంత రైతులు మహారాష్ట్రకు వెళ్తున్నారు. కొందరు వ్యాపారులు ఏపీ, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి విత్తనాలు తెప్పించి రైతులకు విక్రయిస్తున్నట్టు తెలిసింది.
జిల్లాలో నిబంధనల ప్రకారం అనుమతి పొందిన 602 విత్తన, 575 పురుగు మందు, 188 ఎరువుల విక్రయ దుకాణాలు ఉన్నట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. కాని కొన్ని చోట్ల పురుగు మందు విక్రయ దుకాణాల్లో కూడా విత్తనాలు అందుబాటులో ఉంచి నిబంధనలకు విరుద్ధంగా రైతులకు అమ్ముతున్నారని ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. ప్రతి సీజన్‌లో జిల్లాలో రూ. కోట్లల్లో విత్తన వ్యాపారం సాగుతుంది. విత్తన నాణ్యతను నిర్ధారించేందుకు తనిఖీలు చేపట్టాల్సిన అధికార యంత్రాంగం ఏమి పట్టనట్టు వ్యవహరిస్తోందని విమర్శలు వస్తున్నాయి.
నకిలీ విత్తనాల వల్ల రైతులు ఎక్కడా నష్టపోకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి. మార్కెట్లో విత్తన అమ్మకాలపై ప్రత్యేక పర్యవేక్షణ ఏర్పాటు చేయాలి. యాసంగీ సీజీన్‌లో ఆరుతడి పంటల సాగుకు ప్రభుత్వం తక్షణమే సబ్సిడీ విత్తనాలు ఇవ్వాలి.
–కేజీ గంగారాం, రైతు, సాలూర
ప్రస్తుత వాతావరణ మార్పుల నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించే కార్యక్రమంలో ఉన్నాం. మరోవైపు విత్తన విక్రయాలపై ప్రత్యేక దృష్టిసారిస్తాం. రైతులు విత్తన కొనుగోలు సమయంలో జాగ్రత్తలు పాటించాలి.
–శ్రీనివాస్‌రావు, ఏడీఏ, బోధన్


