నిబంధనల మేరకే ఇసుక రవాణాకు అనుమతులు | - | Sakshi
Sakshi News home page

నిబంధనల మేరకే ఇసుక రవాణాకు అనుమతులు

Nov 7 2026 12:30 AM | Updated on Nov 7 2026 12:30 AM

నిజామాబాద్‌ అర్బన్‌: జిల్లాలోని వివిధ క్వారీల నుంచి నిబంధనలకు అనుగుణంగానే ఇసుక రవాణాకు అనుమతించడం జరుగుతోందని, ఎక్కడైనా ఉల్లంఘనలు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ ఇలా త్రిపాఠి హెచ్చరించారు. కలె క్టర్‌ అధ్యక్షతన శుక్రవారం కలెక్టరేట్‌ వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌లో జిల్లాస్థాయి ఇసుక సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. రెవెన్యూ, మైనింగ్‌, ఇంజినీరింగ్‌ తదితర శాఖల అధికారులు హాజర య్యారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, ఇ సుక రీచ్‌లను క్రమం తప్పకుండా తనిఖీ చేయాలని అధికారులను ఆదేశించారు. ‘మన ఇసుక వాహనం’ ఆన్‌లైన్‌ బుకింగ్‌ ద్వారా ఇసుక కేటాయింపులు జరగాలని, ఇసుక రవాణా విషయంలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూడాల్సిన బాధ్యత సంబంధిత శాఖల అధికారులదేనని స్పష్టం చేశారు. యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌, జవహర్‌ నవోదయ విద్యాలయ భవన సముదాయాల నిర్మాణాలకు అవసరమైన ఇసుక నిల్వలను నిర్దేశిత ఇసుక రీచ్‌ల నుంచి తరలించేందుకు అనుమతించినందున ఆటంకాలు లేకుండా చూడాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ రా జాగౌడ్‌, సబ్‌ కలెక్టర్‌ అభిగ్యాన్‌ మా ల్వియా, డీఆ ర్వో గీత, నిజామాబాద్‌, బోధన్‌ ఆర్డీవోలు రాజేంద్రకుమార్‌, విజయకుమారి, మైనింగ్‌ అధికారి బా లు, రెవెన్యూ, ఇంజినీరింగ్‌ విభాగాల అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement