ఉద్యమకారుడు అగ్గు ఎర్రన్న మృతి | - | Sakshi
Sakshi News home page

ఉద్యమకారుడు అగ్గు ఎర్రన్న మృతి

Nov 6 2026 2:08 AM | Updated on Nov 6 2026 2:08 AM

● మెడికల్‌ కళాశాలకు

భౌతికకాయం అప్పగింత

మోపాల్‌: రైతులు, వ్యవసాయ కూలీల హక్కుల కోసం సుమారు నాలుగు దశాబ్దాలపాటు ఉద్య మాల్లో పాల్గొన్న మోపాల్‌కు చెందిన అగ్గు ఎర్రన్న గురువారం ఉదయం గుండెపోటుతో మృతిచెందారు. ఎర్రన్న మృతదేహాన్ని ఎన్‌ఆర్‌ భవన్‌ నుంచి మోపాల్‌లోని తన స్వగృహానికి గ్రామశివారు నుంచి బైక్‌ ర్యాలీగా తీసుకొచ్చారు. ఇంటి వద్ద బంధువులు, ప్రజలు, గ్రామస్తుల సందర్శనార్థం ఉంచారు. ప్రజా ఉద్యమనేత అగ్గు ఎర్రన్న అకాల మ రణం అత్యంత బాధాకరమని నిజామాబాద్‌ రూర ల్‌ ఎమ్మెల్యే భూపతి రెడ్డి విచారం వ్యక్తం చేశారు.

అతడి భౌతికకాయానికి పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు. అనంతరం ప్రజాసంఘాల నేతలు, అభిమానులు మోపాల్‌ నుంచి జిల్లా కేంద్రంలోని మెడికల్‌ కాలేజీ వరకు ర్యాలీగా వెళ్లి ఎర్రన్న భౌతికకాయాన్ని కుటుంబ సభ్యుల సమక్షంలో కళాశాలకు అప్పగించారు. లయన్స్‌ క్లబ్‌కు ఆయన కళ్లను దానం చేశారు. నుడా చైర్మన్‌ కేశవేణు, నాయకులు పరుచూరి శ్రీధర్‌, వేల్పూర్‌ భూమయ్య, మర్కంటి భూమయ్య, వనమాల కృష్ణ, కంజర భూమయ్య, మోపాల్‌ సర్పంచ్‌ ద్యాప రవి, అగ్గు చిన్నయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement