ఖలీల్‌వాడి: జిల్లా కేంద్రంలోని దుబ్బ ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ గిరిరాజ్ కళాశాల ఆవరణలో కమర్షియల్ పద్ధతిలో క్రికెట్ అకాడమీ నిర్వహించడం సరికాదని, నిర్వాహకులపై విచారణ జరిపి తగిన చర్య లు తీసుకోవాలని ఏఐఎస్‌ఎఫ్, ఏఐపీఎస్‌యూ వి ద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు గురువారం కళాశాల ప్రిన్సిపాల్ డా క్టర్ రాంమోహన్ రెడ్డికి వినతిపత్రం అందించారు. ప్రభుత్వ కళాశాల ప్రాంగణంలో క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రికెట్ నెట్ సదు పాయం కళాశాల విద్యార్థులకు ఉపయోగపడాల్సి ఉండగా, కొందరు వ్యక్తులు జిల్లా స్పోర్ట్స్ అథారిటీ అసోసియేషన్ పేరును వాడుకొని ప్రయివేట్ అకాడ మీగా పేర్కొంటూ విద్యార్థుల నుంచి ఫీజులు వసూ లు చేస్తున్నారన్నారు. ప్రిన్సిపాల్ స్పందించి, విచారణ జరిపి, నిబంధనల ప్రకారం తగిన చర్యలు తీ సుకుంటామని హామీ ఇచ్చారు. నాయకులు రఘురాం, బోడ అనిల్, నగేష్, కిషోర్ పాల్గొన్నారు.


