12 నుంచి ‘చెకుముకి’ పరీక్షలు | - | Sakshi
Sakshi News home page

12 నుంచి ‘చెకుముకి’ పరీక్షలు

Nov 6 2026 2:08 AM | Updated on Nov 6 2026 2:08 AM

12 నుంచి ‘చెకుముకి’ పరీక్షలు అదనపు కట్నం కోసం వేధింపులు

నిజామాబాద్‌ అర్బన్‌: జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో 8, 9, 10 తరగతుల విద్యార్థులకు ఈనెల 12 నుంచి ‘చెకుముకి సంబురాలు’ (సైన్స్‌ టాలెంట్‌ టె స్ట్‌) పరీక్షలు నిర్వహించనున్నట్లు జేవీవీ జిల్లా అధ్యక్షుడు సక్కి ఉదయ్‌ కుమార్‌ తెలిపారు. ఈమేరకు కార్యక్రమ కరపత్రాలను గురువారం జిల్లాకేంద్రంలో కలెక్టర్‌ ఇలా త్రిపాఠి చేతుల మీదుగా ఆవిష్క రించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 12న పాఠశాల స్థాయి, 21న మండల స్థాయి, 28న జి ల్లాస్థాయి, డిసెంబర్‌ 11, 12, 13 తేదీల్లో రాష్ట్రస్థా యి పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. సమా జంలో శాసీ్త్రయ ఆలోచనలను పెంపొందించేందు కు, జనవిజ్ఞాన వేదిక వివిధ రూపాల్లో చేస్తున్న కృషిని కలెక్టర్‌ అభినందించారు. జేవీవీ జిల్లా ప్రధాన కార్యదర్శి అజయ్‌ కుమార్‌, సభ్యులు పండరి, సి హెచ్‌ గంగాధర్‌, బాస రాజేశ్వర్‌, పులి జైపాల్‌, రా మ్మోహన్‌రావు, రవీంద్రనాథ్‌ సూరి, శ్రీహరి, షకీల్‌ అహ్మద్‌, ఎంఏ బారి, లక్ష్మణ్‌, దిలీప్‌, గంగాధర్‌, గంగారాం, గిరి, వంశీరాజ్‌, రాంచందర్‌ పాల్గొన్నారు.

నిజామాబాద్‌ లీగల్‌: భార్యను అదనపు కట్నం కోసం వేధించడంతోపాటు, కులం పేరుతో దూషించిన కేసులో భర్తతోపాటు అత్తమామలు, తోటి కోడళ్లకు మూడేళ్ల జైలు శిక్షను ఎస్సీ, ఎస్టీ కోర్టు జడ్జి తీర్పునిచ్చారు. ఎస్సీ, ఎస్టీ కోర్టు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ దయాకర్‌ గౌడ్‌ తెలిపిన వివరాలు ఇలా.. ఆర్మూర్‌ మండలం ఇస్సాపల్లి గ్రామానికి చెందిన పట్టెపు ప్రియాంక, అదే గ్రామానికి చెందిన గడ్డం రంజీత్‌ గౌడ్‌ 13 జూన్‌ 2016న ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కొన్నిరోజులకు ప్రియాంకను కట్నం కోసం భర్త వేధించగా, రూ.8లక్షలను కట్నం కింద తీసుకువచ్చింది. కొద్దిరోజులకు మళ్లీ ఆమెను కులం పేరుతో దూషించడం, అదనపు కట్నం కోసం వేధింపులకు గురిచేశారు. దీంతో మనస్తాపం చెందిన ప్రియాంక తన భర్త రంజీత్‌ గౌడ్‌, అత్త సుశీల, మామ ముత్తా గౌడ్‌, తోటి కోడలు మమతపై వరకట్న వేధింపులు, కులం పేరుతో దూషించడంపై ఆర్మూర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అరెస్టు చేసి, కోర్టుకు పంపారు. విచారణలో నేరం రుజువు కావడంతో జిల్లా ఎస్సీ, ఎస్టీ కోర్టు జడ్జి సుగాలి నారాయణ నలుగురు నిందితులకు మూడేళ్ల జైలు శిక్ష, రూ.పదివేల చొప్పున జరిమానా విధించారు.

● భర్తతోపాటు మరో ముగ్గురికి

మూడేళ్ల జైలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement